ప్రత్యేక కధనం: సీనియర్ జర్నలిస్ట్ ఆది
చిరంజీవికి మార్కెట్ భయం ఎక్కువ.. అతడు ఒక బాలకృష్ణలా.. ఒక నాగార్జున, వెంకటేష్ లా, మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్, రజనీ కాంత్ లా.. ఉండలేడు.. వీరెవరికీ లేనంత మార్కెట్ భయం.. అతడేం చేసినా మార్కెట్ కోసమే చేస్తాడు.. అంతెందుకు నిన్నటికి నిన్న.. చిరంజీవి తన ఆచార్య సినిమా కథ రాజమౌళీదే అన్న మార్కెట్ పులిహోర కలిపే యత్నం చేయడం అందరూ చూసే ఉంటారు.. అదేంటి? ఈ కథ నాది కదా? అని పక్కనే ఉన్న కొరటాల బిక్కమొహం వెయ్యడమూ చూసే ఉంటారందరూ. దటీజ్ చిరంజీవి.. చిరంజీవికి ఒక కథ చెప్పాలంటే.
అందుకంటూ ఒక మార్కెట్ ఉండాలి.. ఆయన కథ వినాలంటే మినిమం మురుగదాస్- మాక్స్ రాజూ హీర్వాణీ అయి ఉండాలి.. లేదంటే నాలుగైదు వరుస హిట్లు ఇచ్చిన కొరటాల లాంటి వారై ఉండాలి.. దటీజ్ చిరంజీవి.. పాపం ఇన్నేసి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరీ ఇంత వరకూ చిరంజీవికి కథ అమ్మలేక పోయాడు.. ఇడియట్ హిట్ తర్వాత కథ చెప్పడానికి వెళ్తే.. పూరీకి పకోడీలు పెట్టినట్టే పెట్టి.. చీవాట్లు కూడా పెట్టాడంట.. అదేమంటే.. ఒక ఆకతాయి సినిమాలు తీసుకునే నువ్వా నన్ను డైరెక్ట్ చేసేదన్నది చిరంజీవి నుంచి వచ్చిన అతి మెత్తటి చెప్పుతో కొట్టినలాంటి మాట.. ఇదే సినిమాను తర్వాత ఆంధ్రావాలాగా పూరీ జూనియర్ తో లాగించేశాడు.. సరిగ్గా అదే సమయంలో
మార్కెట్లో ఎక్కడ ఎవరికి హిట్లుంటే వారి హిట్ ఫ్లేవర్ అమాంతం లాగేసుకుని తన సినిమాకు ఆపాదించడం చిరు ప్లే చేసే ఒకానొక హిట్ ఫార్ములా.. ఫర్ సపోజ్ ఠాగూర్ సినిమాకు వినాయక్ డైరెక్షనే తీసుకుంటే.. ఆ సరికే అతడికి ఆది, చెన్నకేశవరెడ్డి వంటి రెండు హిట్ సినిమాలు ఉండటం వల్ల.. అలాగని ఆ మూవీలో వినాయక్ చేసిన డైరెక్షనే లేదన్న మాట ప్రచారంలో ఉంది.. కేవలం తనకిచ్చిన పాత్ర తాను చేసుకుని..
ఇచ్చిన పేమెంట్ పుచ్చుకుని.. సెట్లో మూలగా ఒక చోట కూర్చోవడం మాత్రమే వీవీ వినాయక్ చేసిన పనిగా చెప్పుకొస్తారు సెట్ బాయిస్..
ఈ చిత్రానికంటూ చిరంజీవి వినాయక్ చేత డైరెక్షన్ చేయించిందే లేదు.. స్టాలిన్ సమయంలో ఏఆర్ మురుగదాస్ చిరంజీవి పోకడ నచ్చక పారిపోయాడనీ.. ఇదే సినిమాను మలినేని గోపీచంద్ పూర్తి చేయాల్సి వచ్చిందనీ అంటారు.. కారణం చిరంజీవి ప్రతిదానికీ కొర్రి పెట్టేస్తాడు..
అసలు స్క్రిప్ట్ లోని ఫస్ట్ లెటర్ నుంచి చివరి పదం వరకూ.. ఆయన తనదైన మార్క్ లోకి కథను మార్చి రాసేసుకుంటాడన్న పేరుంది..
అదేమంటే క్రేజ్- మార్కెట్- ప్యాన్స్.. ఈ మూడు పదాల చుట్టూ ఆయన సినిమా చక్కర్లు కొడుతుంటుందని అంటారు. నిజమే ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే అదో మార్కెట్ మాస్టర్ పీస్.. అత్యధిక వసూళ్ల కథా చిత్రం.. ఆయనసలు ఒక సినిమా టచ్ చేస్తే అది మినిమం వంద మాక్సిమం ఏడాది కాలం పాటు ఆడ్డం మాత్రమే కాదు.. కోట్లాది రూపాయల వసూళ్ల వర్షం కురిపించేది.. బాహుబలి వచ్చాక అత్యధిక కలెక్షన్ల చిత్రాల రాత గీత మారిందిగానీ.. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ముందు మార్కెట్ మృగరాజు చిరంజీవే.. అందుకే ఆయనకు మెగా బిరుదిచ్చింది ఇండస్ట్రీ.. కానీ ఇపుడా సీన్ లేదు.. ఆయన ఎంపిక చేసుకునే కథల్లో సహజత్వం కోల్పోయి… నాటు మార్కెట్ వాసన వస్తూ ఉంటుంది.. అందుకే చిరంజీవి సినిమాలు రాన్రాను నాసి రకం సరుకుగా మారిపోతున్నాయ్.. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆ మాటకొస్తే 90 ఏళ్ల వరకూ తాను నటిస్తూనే ఉంటానని ఆయన తన అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు కానీ.. 66 ఏళ్ల వయసులో కూడా అవే తైతక్కలాటలాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు.. మార్కెట్ కమర్షియల్ పంథాలోంచి చిరంజీవి పూర్తిగా బయటకొచ్చి అవుటాఫ్ ద బాక్స వర్కవుట్ చేయాలి…
ఇలా చేయడం చిరంజీవికి సాధ్యమయ్యే పని కాదు.. తనకు తాను ఇంకా పదహారేళ్ల పడుచు హీరోలా ఫీలయిపోతూ.. ఇంకా తన కొడుకు పక్కన చేసే పూజా హెగ్డేలాంటి హీరోయిన్లతో డ్యాన్సులాడాలనీ.. ఆ మాటకొస్తే.. ఆఫ్ ద స్క్రీన్ చిలక్కొట్టుడ్లు కొట్టేయాలన్నది చిరంజీవి డ్రీమ్స్..
ఆయనింకా పడుచు కలలు కంటూనే ఉంటారు..
డిఫరెంటు కేరెక్టర్స్, కొత్త కథలను ఆహ్వానించడం ఏ అనుభవం లేని వాళ్లు మార్కెట్ లేని వాళ్లను సైతం కథ బావుంటే చాలు ఆదరించాలన్న ఆలోచన చేయడం వంటివి చిరంజీవి చేయాల్సి ఉంటుంది.. ఒక్కోసారి కథలో తన పాత్ర ప్రకారం తాను నటించుకుంటూ వెళ్లాలన్న పరిమిత ఆలోచనలకు రావాలి.. మమ్ముట్టీ ఇంకా మలయాళ సూపర్ స్టార్ గా ఉన్నారంటే.. అందుకు కారణం ఆయన ఇలాంటి ధోరణి అవలంభించడమే.. కథ మొత్తం తానే ఉండాలన్న పిచ్చి కోరికలుండవు.. కథ లో తన పాత్ర కొంతైనా సరే.. మంచిగా నటించుకుని మంచి మార్కులు వేయించుకోవాలన్న ఆలోచన చేయాలి.. చిరంజీవిని తెర నిండా చూడాలన్న పిచ్చి ఆలోచన కోరికలు ఒకప్పటివి..
ఆయనెప్పుడైతే.. కొన్నేళ్ల పాటు రాజకీయాల పరంగా.. జనం లోకి వెళ్లారో అప్పుడే చిరంజీవి కథ ముగిసిపోయింది.. చిరును చూడాలని ఉంది అన్న కోర్కెలన్నీ అప్పుడే తీరిపోయాయి.. తర్వాత ఆయన్ను చూడ్డానికి జనం ఎగబడ్డం దాదాపు ముగిసిపోయిన ఒక శకం.. ఇపుడాయన్ను చూడాలన్న ఆలోచనతో పెద్దగా ఎవ్వరూ లేరు.. కాబట్టి.. ఆయన తన పూర్వకాలపు ఊహలకు ఇకనైనా స్వస్తి చెప్పాలి.. మీరంటే చిరంజీవి ఊ- అనేస్తారా? అని మీకనిపించవచ్చు కానీ ఆయన ఖచ్చితంగా ఇలాంటి సలహా సూచనలు పట్టించుకోవడం ఇటీవల స్టార్ట్ చేశారు.. కరోనా సమయంలో తొలుత జనం సమస్యలు పట్టించుకోకుండా.. తానేంటో తన కూరల వంటకాలేంటో అని సైలెంట్ గా ఉన్న చిరు తర్వాతి రోజుల్లో సిలిండర్లు అందించే స్థాయికి చేరారు ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే.. సినిమాల పరంగా కూడా చిరంజీవి.. తొలుత తన మార్కెట్, కమర్షియల్ కుబుసం విడవాలి.. మంచి కథ ఎవరు చెప్పినా విని చేసేందుకు ముందుకు రావాలి.. నిజంగా తాను 90 ఏళ్ల వరకూ సినిమాలు చేస్తూనే ఉండాలన్న ఆశ గానీ నిజమైతే.. అమితాబ్ లా కొన్ని మంచి పాత్రలకు కమిట్ కావాలి.. అలా చేసినపుడే ఆయన రియల్ మెగా స్టార్ అనిపించుకుంటారు.. లేకుంటే.. ఇలాగే డిస్ట్రిబ్యూర్లకు నష్టాలు తెచ్చి పెట్టే మెగా లాస్ స్టార్ గా ముద్ర వేయించుకోక తప్పదు.. ఏమంటారు ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంటి?
జై ఆచార్య