సునైనా లేడీ ఓరియంటెడ్ మూవీ ‘రెజీనా’
“నీర్పరవై” వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల “సిల్లు కారుపట్టి” అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకున్న సునైనా.. ‘లేడీ ఓరియంటెడ్ మూవీ ‘రెజీనా’తో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చారు.
కోయంబత్తూరుకు చెందిన “ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్ఎల్పి” బ్యానర్ లో కొత్త నిర్మాత సతీష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. “పైపిన్ చువత్తిలే ప్రణయం’, “స్టార్” వంటి చిత్రాలను తెరకెక్కించిన డొమిన్ డిసిల్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.