Custody Movie : అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చైతూకి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. ‘బంగార్రాజు’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ మూవీ కెరీర్ పరంగా చైతూకి 22వ ది కావడం విశేషం. ఈ మూవీకి సంబంధించి మరో ప్రత్యేక విషయం ఏంటంటే మాస్ట్రో ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం. అలానే విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తుండగా .. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనునున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.
ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి.. ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమం లోనే తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే 90’s బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా కథ ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక నాగచైతన్య ఇప్పటి వరకు చేయని మాస్ యాక్షన్స్ తో దుమ్ముదులిపేశాడు. ముఖ్యంగా ఈ టీజర్ లో ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది.
The hunt begins ! #CustodyTeaser Telugu : https://t.co/vKGeGerPmW Tamil : https://t.co/H7IhMUujD3 Cheers @vp_offl for this cut , @ilaiyaraaja @thisisysr the score is on repeat !!Thanks @IamKrithiShetty @thearvindswami @srinivasaaoffl @realsarathkumar @SS_Screens pic.twitter.com/mwwSBA66WO
— chaitanya akkineni (@chay_akkineni) March 16, 2023
అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడోస్తుంది, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్ దట్ ట్రూత్ ఇన్ మై కస్టడీ’ అంటూ నాగచైతన్య డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. చూడాలి మరి చైతూ ఈ చిత్రంతో అయిన సాలిడ్ హిట్ అందుకుంటాడా లేదా అని..