Pawan Kalyan Tholiprema : రీ రిలీజ్ కి రెడీ అయిన పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ “తొలి ప్రేమ”..

Pawan Kalyan Tholi prema : ఆడియన్స్ ని మరింత అలరించే మరో క్లాసికల్ లవ్ స్టోరీ థియేటర్ లో రానుంది . మన టాలీవుడ్ లో మొదలైన ఈ రీ రిలీజ్‌ల ట్రెండ్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలను ఆకర్షిస్తుంది. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లోని చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. తాజాగా 90’s బ్లాక్ బస్టర్ తొలిప్రేమ రీ రిలీజ్ కి సిద్దమవుతుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా అప్పటి యూత్ ని ప్రేమలో పడేసింది. అప్పుడే కాదు ఇప్పటి వారికి కూడా ఆ సినిమా అంటే ఒక ఫీల్ వస్తుంది. ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది.

ప్రియురాలు కోసం పవన్ పడే వేదన అందర్నీ ఫీల్ అయ్యేలా చేసింది. కేవలం హీరోహీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్ ని కూడా దర్శకుడు చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా అన్న చెల్లి రిలేషన్ ని ఎంటర్టైన్ గా చూపిస్తూనే.. ఆ బంధంలో చూపించిన ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పరిచయం చేసే సీన్ రెఫెరెన్స్ తో ఇప్పటి సినిమాల్లో కూడా పలు సీన్స్ కనిపిస్తాయి. కీర్తిరెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కరుణాకరన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఈ సినిమాకి మరో హైలైట్ సంగీత దర్శకుడు దేవా ఇచ్చిన మ్యూజిక్. తొలిప్రేమలోని ప్రతి సాంగ్ ఇప్పటికి ప్రతి ఒక్కరి ప్లే లిస్ట్ స్థానం ఉంటుంది. అన్ని రకాలుగా అలరించిన ఈ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుండడంతో జూన్‌ 30న 4K ప్రింట్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ఈ మూవీ రీ రిలీజ్ కోసం చూస్తున్న టాలీవుడ్ అభిమానులు.. థియేటర్ లో తొలిప్రేమ మ్యాజిక్ ని ఫీల్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

 

 

Share This Link

Related Posts

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Links

Facebook Fan Page

Facebook Page – Health Tips

ఇతను ఇకముందు రాజకీయాలకు అవసరం లేదు ?

డేంజరెస్ – ఇద్దరమ్మాయిల ప్రేమ కథ

యువగళానికి ఉపశమనం కొబ్బరి నూనె

రేస్ లో గెలుపెవరిది ?

బావ కళ్ళల్లో ఆనందం కోసమే బాలకృష్ణ

Facebook Page – భక్తి ఓంకారం

Telugu World Now

Latest PopularTelugu World Now

బాబు గాడ్సే కన్నా ఘోరం… హిట్లర్ కన్నా నీచం

Facebook Group – తెలుగు పాలిటిక్స్