Entertainment ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్.. రామ్‌చరణ్-అల్లుఅర్జున్‌తో ఓ మల్టీస్టారర్ చేయాలని.. అలాగే ఆ చిత్రనికి చరణ్-అర్జున్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సరైన కథ, దర్శకుడు కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలుస్తోంది. అల్లుఅరవింద్ ప్రస్తుతం ఆ పనిమీదే దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ను లైన్లో పెట్టారట. ఆయనతో చర్చలు జరుపుతున్నారి టాక్.
అయితే ప్రస్తుతం త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఎస్ఎస్ఎమ్బీ 28’ చేస్తున్నారు. ఇది పూర్తవ్వగానే ఆ సినిమా కథపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికార ప్రకటన లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి..
కాగా, ఇటీవలే ఆర్ఆర్ఆర్తో భారీ హిట్‌ను అందుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్సీ 15లో నటిస్తున్నారు. ఇక అల్లుఅర్జున్ విషయానికొస్తే.. ‘పుష్ప’ సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఆయన.. పుష్ప 2 కోసం సన్నద్ధమవుతున్నారు. కాగా, ఇటీవలే చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. అలానే కొత్త కథలు వింటూ తన తదుపరి సినిమాలను లైన్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.





















