Anchor Lasya : తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది లాస్య. తనదైన కామెడీ పంచులు, జోక్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా యాంకర్ రవితో ఆమె చేసిన షోలు బాగా ఆదరణ పొందాయి. ఇక బిగ్‌బాస్ రియాల్టీషోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. లాస్య చెప్పే ఆమె ఏనుగు-చీమ జోక్స్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది లాస్య.
కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్ అనే కుమారుడికి జన్మనిచ్చింది లాస్య. ఇటీవల రెండోసారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల తన సీమంతం వేడుకను ఘనంగా జరుపుకోగా, ఈ వేడుకకు పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు.
తాజాగా మరోసారి తల్లిదండ్రులు కావడంతో లాస్య – మంజునాథ్ దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే తన డెలివరీ టైమ్ దగ్గరపడుతుందని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన లాస్య.. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. హోలీ రోజున తనకు పండంటి బాబు పుట్టాడని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోతో ఈ గుడ్ న్యూస్‌ను అందరితో పంచుకుంది లాస్య. తమ ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా సంతోషాన్ని పంచుకుంది. మార్చి 7న తనకు బాబు పుట్టినట్లుగా లాస్య చెప్పడంతో బిగ్ బాస్ ఫేమ్, నటి సిరి హన్మంత్ కంగ్రాట్స్ చెప్పగా.. మరో యాంకర్ స్రవంతి చొక్కారపు తదితరులు లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం లాస్య పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.