AR Rahman : రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. కాగా ఈ సినిమా ఆస్కార్ సొంతం చేసుకుకోవడంతో అందరు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు.
అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారనిపిస్తోంది.. కానీ ఏం చేస్తాం చూస్తూ ఉండటం మాత్రమే చేయగలం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అఫిషియల్ ఎంట్రీ గా ఆర్ఆర్ఆర్ ని పంపినట్లైతే మరో అవరడు ఖచ్చితంగా సాధించేది అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రెహమాన్ 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను రెండు ఆస్కార్ లను అందుకున్నారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకుంది. అయితే ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచేందుకు పెద్ద కథే జరిగింది అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇండియా లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో ఆదరణ పొందింది. పాపులారిటీ మాత్రమే కాదు ఆస్కార్ కి వెళ్లే అర్హత కూడా ఉండడంతో.. భారత్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఆస్కార్ కి పంపిస్తుంది అని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ ని కాదని గుజరాతీ సినిమా లాస్ట్ ఫిలిం షోని ఆస్కార్ నామినేషన్స్ కి పంపించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.