Ayurveda Panchakarma Physiotherapy Training Courses in Kerala Santhigiri Ashram, Minister Jagadish Reddy, Nabard, Health News, Telugu World Now,
Health News: ఫిజియో థెరపీ కోర్సుల శిక్షణలో “శాంతిగిరి ఆశ్రమం” భేష్: మంత్రి జగదీష్ రెడ్డి
శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోను ఉపాధి, నాబార్డ్ సహకారంతో 25 మందికి శిక్షణ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి,
పురాతన కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చిన పంచకర్మ ఫిజియా థెరపీ కోర్సులో శిక్షణ ఇవ్వడంలో కేరళకు చెందిన శాంతిగిరి ఆశ్రమం ముందు ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నాబార్డ్ సహకారంతో ఈ కోర్సులో శిక్షణ ఇచ్చిన వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల ఆయన ఆశ్రమం నిర్వాహకులను అభినందించారు. ఈ సంవత్సరం ఆ సంస్థ సౌజన్యంతో నాబార్డ్ సహకారంతో శిక్షణ పొందిన 25 మందిలో 13 మంది సూర్యపేట కు చెంది ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన 25 మందికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోని శాంతిగిరి ఆశ్రమం విభాగాలలో ఉద్యోగ అవకాశాలు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈ సంవత్సరం నాబార్డ్ సహకారంతో శాంతిగిరి ఆశ్రమం సౌజన్యం తో ఆయుర్వేద పంచకర్మ థెరపీ కోర్సులో శిక్షణ పొందిన 25 మందికి మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియమకపు పత్రాలను అందజేశారు. యింకా ఈ కార్యక్రమంలో నాబార్డ్ డెవలప్మెంట్ మేనేజర్ యస్. ప్రవీణ్ కుమార్,శాంతిగిరి ఆశ్రమం తెలుగు రాష్ట్రాల బాద్యులు యస్ ప్రమోద్ కుమార్, దిశ ఫౌండేషన్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.