Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ సాగించిన ఈ హీరో.. ఇప్పుడు విలన్ గానూ మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇందులో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పుడు మరో ప్రాజెక్ట్ చేసేందుకు సైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న #Ntr30 చిత్రంలో సైఫ్ నటించనున్నారట. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం సైఫ్ ను ఎంపిక చేయగా.. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మేరకు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేరుగా తెలుగు సినిమాలో విలన్ గా సైఫ్ రాబోతున్న తరుణంలో ఆయన ఏ రేంజ్ లో అలరిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆస్కార్ ని కూడా సాధించడంతో ఇపుడు తారక్ చేసే ఈ సినిమాపై కేవలం పాన్ ఇండియా వైడ్ గానే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక కాగా ఇక సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమ్రిత సింగ్ కి ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్.. అదే విధంగా రెండో భార్య కరీనా కపూర్ కి ఇద్దరు కొడుకులు తైమూర్ అలీ ఖాన్, జేహంగీర్ అలీ ఖాన్. సారా బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది.