Center For Agri Innovation Hub, Sri Lanka Deputy High Commissioner D Venkateshwaran, CM KCR, Professor Jayashankar Agriculture University, Telugu World Now,
NEWS: అగ్రిహబ్ అదుర్స్ – నూతన ఆవిష్కరణలకు ఊతం – శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ ప్రశంస.
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఇటీవల ఏర్పాటు చేసిన అగ్రి ఇన్నోవేషన్ హబ్ అద్భుతంగా ఉన్నదని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డీ వెంకటేశ్వరన్ ప్రశంసించారు. ఈ ఆలోచన వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తుందన్నారు. బుధవారం ఆయన వర్సిటీని సందర్శించారు.
ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో వర్సిటీ చేస్తున్న పలు పరిశోధనల గురించి డైరెక్టర్ జగదీశ్వర్ ఆయనకు వివరించారు. ఇలాంటి పరిశోధనలను శ్రీలంకలోనూ చేయాలని, ఇందుకోసం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని వెంకటేశ్వరన్ అభిప్రాయపడ్డారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.