సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ సైబరాబాద్ పోలీసు కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., అడ్మిన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. పర్మిషన్లకు సంబంధించిన అంశాలను చర్చించారు, ముఖ్యంగా ఆర్మ్స్ లైసెన్స్, సినిమాటోగ్రఫీ పర్మిషన్స్, బ్లాస్టింగ్ పర్మిషన్స్, స్కూల్ పర్మిషన్స్, పెట్రోలియం పర్మిషన్స్, షూటింగ్ పర్మిషన్స్ తదితర పర్మిషన్లకు సంబంధించి సిపి గారు సిబ్బందికి విధి విధానాలు తెలియచేశారు. అలాగే
ర్యాలీలు, రోడ్ డైవర్షన్, e-చల్లాన్ గ్రీవియేన్సస్, టికెట్ కాన్సెర్ట్స్ తదితర పర్మిషన్లకు సంబంధించి సీపీ గారు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ప్రతీఒక్క పర్మిషన్ల ఎంక్వయిరీకి ఇన్స్పెక్టర్లు వెళ్లాలంటే వారి రోజు వారీ విధులకు, కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున… ఏసిపి స్థాయి అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇవ్వడం ద్వారా తొందరగా ప్రాసెస్ అవ్వడం తో పాటు త్వరితగతిన పర్మిషన్లు ఇవ్వడం సాధ్యం అవుతుందన్నారు.
దీంతో క్షేత్ర స్థాయి లో పనిచేసే ఇన్ స్పెక్టర్లకు వారి రోజువారి విధులను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలుందన్నారు. రానున్న రంజాన్, ఉగాది, శ్రీ రామనవమి, హనుమాన్ ర్యాలీ తదితర పండుగలు ఉన్నందున బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు చేశారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి బందోబస్తు అంశాలను సిపి గారు చర్చించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినపుడు సబ్ ఇన్స్పెక్టర్లు మొదట రెస్పాండర్ గా ఉంటారు.. కావున వారు క్రమశిక్షణ తో విధులు నిర్వహించాలన్నారు. పర్మిషన్లు, లైసెన్సులకు సంబంధించి సిబ్బందికి సాధికారతను అందించడమే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి గారితో పాటు జాయింట్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ శ్రీ నారాయణ నాయక్, ఐపీఎస్., సైబరాబాద్ డిసిపి క్రైమ్స్ శ్రీ సింగర్ కల్మేశ్వర్, డిసిపి అడ్మిన్ శ్రీ యోగేష్ గౌతమ్, ఐపీఎస్., డిసిపి షీ టీమ్స్ శ్రీమతి దీప్తి పంత్, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డిసిపిలు మాదాపూర్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి శ్రీ నారాయణరెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ డిసిపి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, బాలనగర్ డిసిపిటి శ్రీనివాసరావు, ఐపిఎస్., మేడ్చల్ డిసిపి శ్రీ సందీప్, సైబర్ క్రైమ్ డిసిపి శ్రీమతి రితిరాజ్, ఐపీఎస్., ఏడిసిపి రాజేంద్రనగర్ శ్రీమతి సాధన రష్మి పెరుమాళ్, ఐపిఎస్., ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.