Deepthi Sunaina : సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొంది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇక వారిలోనే “దీప్తి సునైనా” గురించి తెలియని వారుండరు. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ భామ. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ.. మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఒంటరిగా కంటే కూడా దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ జంటగా బాగా పేరు తెచ్చుకున్నారు.
అయితే దీప్తి సునైన-షణ్ముఖ్ జస్వంత్ 2021లో సోషల్ మీడియా వేదికగా తమ బ్రేకప్ మేటర్ రివీల్ చేశారు. కాగా సిరి హన్మంత్ వలనే విడిపోయారన్న మాట గట్టిగా వినిపించింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్, సిరి సన్నిహితంగా మెలిగారు. చెప్పాలంటే స్నేహితులమని చెప్పుకుంటూ ప్రేమికులకు మించి రొమాన్స్ చేశారు. అప్పటి నుండి దీప్తి-షణ్ముఖ్ విడివిడిగా ఉంటున్నారు. కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. షణ్ముఖ్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిజిటల్ సిరీస్లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు.
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునైన తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. మీరు నన్ను బహిష్కరించారు. నా జీవితం దుర్భరంగా తయారైంది అంటూ ఆ వీడియోలో వెల్లడించడం జరిగింది. తన ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి విడిపోయిన నేపథ్యంలో దీప్తి వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది.