సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సెక్టార్ SIల కోసం పనితీరును నమోదు చేయడానికి Performance Appraisal Handbook ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి లోని సెక్టార్ ను మినీ పోలీసు స్టేషన్ గా పరిగణించి సెక్టార్ ఎస్సైలు పనితీరును మెరుగుపరచుకోనే విధంగా Performance Appraisal Handbook ఉపయోగపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో సెక్టార్ ఎస్ఐలది కీలకపాత్ర అన్నారు. సెక్టార్ ఎస్సైలు వారి సెక్టార్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. నేరాలను తగ్గించేందుకు సెక్టార్ ఎస్సైలు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలన్నారు. సెక్టార్ ఎస్సైలు ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్, సీన్ విజిట్, బైండోవర్, నేరం జరిగిన ప్రాంతం, PITA యాక్ట్ లపై దృష్టి పెట్టాలి.
ఈ పుస్తకంలోని సెక్టార్ SIలు వారి సెక్టార్ పరిధిలోని రిజిస్టర్ అవుతున్న నేరాల వివరాలు, చార్జ్ షీట్ వివరాలు, PT కేసులు, UI కేసుల వివరాలు, సెక్టార్ పరిధి యొక్క పూర్తి సమాచారాన్ని నమోదు చేసినట్లయితే IO’s , SHO’s, SI’s సులభమైన సూచన గైడ్‌గా పనిచేస్తుంది. పుస్తకాన్ని 24 నెలల పాటు చక్కగా, ఖచ్చితమైన మరియు జవాబుదారీగా నమోదు చేయాలి. ప్రతి నెలాఖరులో, పుస్తకాన్ని పూర్తిగా పూర్తి చేసి, ఉన్నతాధికారులందరూ సమీక్షించడానికి సిద్ధంగా ఉండాలి. సెక్టార్ వారీగా పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసుల కేటాయింపు సంబంధిత SHOS మరియు ACPల ద్వారా సెక్టార్ SIలకు చేయబడుతుంది, వారు వారి PT కేసుల యొక్క అన్ని దశలను పర్యవేక్షించేందుకు Performance Appraisal Handbook ఉపయోగపడుతుందన్నారు. తద్వారా నేర నియంత్రణ, నాణ్యతతో కూడిన నేరదర్యాప్తు చేయుటకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో లో సైబరాబాద్ సీపీ గారితో పాటు .. సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, ఐపిఎస్., బాలానగర్ డిసిపి శ్రీనివాస రావు, ఐపిఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డిసిపి సందీప్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.