బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ,మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎక్కడకెళ్లి హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం చేసిన కానీ చివరలో నన్ను చూసి ఓటు వేయండి. కమలం గుర్తుకే ఓటు వేయండి అని ప్రచారాన్ని ముగిస్తున్నాడు తప్పా ఎక్కడ కూడా జై బీజేపీ జై మోదీ జై భారత్ జై శ్రీరామ్ అని బీజేపీ శ్రేణులు నిద్రలో కూడా ఇచ్చే నినాదానాలను ఈటల రాజేందర్ అనడం లేదు. ఎందుకు అనడం లేదు. అలా అంటే ఏమైన సమస్యలను ఈటల రాజేందర్ ఎదుర్కోవాల్సి వస్తుందా అని ఆలోచిస్తే విశ్లేషకులు అవుననే అంటున్నారు..
అసలు ముచ్చట ఏంటంటే అచ్చా దిన్ ఆయే అంటూ అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం ..ప్రధానమంత్రి నరేందర్ మోదీ గత ఏడేండ్లుగా సామాన్యులకు కానీ యావత్ అఖండ భారతవానికి చేసిన ఒక్క మంచి పని లేదు..ఒక్క మంచి పని లేకపోగ నిత్యావసర వస్తువులైన నూనె దగ్గర నుండి పెట్రోల్ ,డీజిల్,గ్యాస్ సిలిండర్ ఇలా అన్నింటిపై ధరలు పెంచుతూ పోతుండు మోదీ.. అక్కడితో ఆగకుండా ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నాడు మోదీ..
దీంతో ఈటల రాజేందర్ ఎక్కడ జై బీజేపీ జై మోదీ జై భారత్ జై శ్రీరామ్ అని అంటే తనకు పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడవు.. గెలుపు సంగతి పక్కనెట్టి కనీసం డిపాజిట్లు కూడా దక్కవనే ఆలోచనతోనే ఈటల ఆ నినాదాలు చేయడం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.జై బీజేపీ అంటే జనం తోలు తీస్తరేమో..? బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా దర్నాలు చేస్తున్న రైతులను కార్లతో తొక్కించే దృశ్యం గుర్తుకొస్తదేమో? ఏల్పీజీ సిలిండర్, పెట్రోల్ ధరలు గుర్తుకొస్తయేమో అనే భయంతోనే ఈటల అలా పలకడం లేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.