ఎగ్జైటింగ్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సోని లివ్ ఓటీటీ మరో థ్రిల్లింగ్ మూవీని రిలీజ్ చేయబోతోంది. ఆ చిత్రమే సుహాస్ హీరోగా నటించిన “ఫ్యామిలీ డ్రామా”. కలర్ ఫొటో చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ నటుడు సుహాస్ కొత్త సినిమా “ఫ్యామిలీ డ్రామా” ఈ నెల 29న సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మెహెర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. “ఫ్యామిలీ డ్రామా” చిత్ర ట్రైలర్ ను ‘సోని లివ్’ రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్, అనూష నూతుల, శ్రుతి మెహర్, సంజయ్ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: అజయ్, సంజయ్, ఛాయాగ్రహణం: వెంకట్ ఆర్. శాఖమూరి, దర్శకత్వం – మెహెర్ తేజ్.