ప్రపంచం ఎన్నో యుగాలను దాటుకుంటూ వస్తూ,ఇప్పటికీ డిజిటల్ యుగంలో కి అడుపెట్టింది. అన్ని యుగాలలోను ఉన్న ప్రత్యేక పరిణామాల కంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అత్యద్భుతంగా అనిపిస్తున్నాయి అనడం లో అతిశయోక్తి లేదు. అందుకు కారణం సాంకేతికత మరియు కళల మేళవింపు. సాండ్ ఆర్ట్ అనే కళ ఈ మధ్య కాలం లో బాగా ప్రాచుర్యం పొందిన చిత్రకళ మరియు సాంకేతికల మెలవింపుల అద్భుతమైన కళ ఇది. అలాంటి కళ ను నేర్చుకోవాలని ఎవరికి గానీ ఆశ ఉండదూ, అందుకే ప్రముఖ చిత్రకారులు సాండ్ ఆర్టిస్ట్ సుదాకాంత్ గారు అందరికీ అనుకూలంగా ఆసక్తి వున్న వారికి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు.అలాగే డిజిటల్ యుగంలో ఎన్నో అద్భుతాలలో ఒకటైన విర్చ్యుయల్ రియాలిటీ అనే మాధ్యమం కాస్త సుపరిచితమే అందరికీ, అలాంటి మాధ్యమం లో కూడా ప్రవేశం పొంది పట్టు సాధించి, అందులో కళాత్మకత ను అందరికీ పరిచయం చేసి మన్ననలు పొందుతున్నారు, అలాంటి సాంకేతిక కళాత్మక మాధ్యమాన్ని అందరికీ దగ్గరికి చెయ్యాలన్న ఆలోచనతో ఒక అవగాహన సదస్సును ప్రారంభిస్తున్నారు, ఇంతటి మంచి కార్యక్రమానికి తెలంగాణ భాష మరియు సంస్కృతి శాఖవారు సమర్పణలో హైదరాబాదు రవీంద్ర భారతి ఆడిటోరియం నందు ఈ సదస్సును చేయదలిచారు. అందుకు పూర్తి వివరాలు మరియు సదస్సుకు హాజరు కావాలనుకునే ఔత్సాహికులు ఇక్కడ ఉన్న వెబ్సైట్ లింక్ ద్వారా కానీ, క్వీ ఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫాం పొంది, తద్వారా రిజిస్టర్ చేసుకుంటే తరువాత మీకు సదస్సు యొక్క తేదీ ఇతర వివరములు తెలియచేస్తారు.
ఇందుకు Fine arts Field వారు, Btech Degree వారు, Fashion Design, Architect, మరియు కళ ల మీద మక్కువ ఉన్నవారు ఇందుకు ప్రధాన ఆహ్వానితులు. వివరాలకు www.sudhakanth.com ను సంప్రదించండి.