దక్షిణాది భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 24న విడుదలకానున్న న్యాచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’
సినిమా మీదున్న బజ్ దృష్ట్యా తెలుగు,తమిళ, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవి, నానిలపై ఓ రొమాంటిక్ పోస్టర్ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్ను ప్రకటించేశారు. పీరియడ్ జోన్లో సాయి పల్లవి, నానిల మధ్య అద్భుతమైన ప్రేమ కథ ఉండోబోతోందని పోస్టర్ను చూస్తే తెలుస్తోంది.
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు
సాంకేతిక బృందం :
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
కథ : సత్యదేవ్ జంగా
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్ : నవీన్ నూలి
ఫైట్స్ : రవి వర్మ
కొరియోగ్రఫీ : కృతి మహేష్, యశ్ మాస్టర్
పీఆర్వో : వంశీ-శేఖర్