ప్రభుదేవా, అదాశర్మ, నిక్కిగల్రాని హీరో హీరోయిన్లుగా నటించగా శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ‘చార్లీ చాప్లిన్’ చిత్రాన్ని తెలుగులో శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై ఎమ్ .వి. కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి తెలుగులో కి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈరోజు ఫిలించాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…“మహేష్ చౌదరి, వి.శ్రీనివాసరావు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ గా ఎన్నో పెద్ద చిత్రాలు రిలీజ్ చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన చార్లిచాప్లిన్ చిత్రాన్ని`మిస్టర్ ప్రేమికుడు`గా తెలుగులో అనువదిస్తూ నిర్మాతలుగా మారారు. ప్రభుదేవా నటించిన ఎన్నో మంచి చిత్రాల్లో ఇదొకటి. మొదట్లో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. ఎందుకంటే తెలుగు నేటివిటీకి సరిగ్గా సరిపోయే సినిమా ఇది. లవ్, కడుపుబ్బ నవ్వించే కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఇందులో మంచి పాటలు కూడా ఉన్నాయి.
ప్రభుదేవా నటన, నిక్కి గల్రాని, అదాశర్మ అందం, అభినయం, శక్తి చిదంబరం డైరక్షన్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ నెల 29 వస్తోన్న ఈ చిత్రంతో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చి మరెన్నో చిత్రాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.