నన్బగళ్ నెరదు మయక్కం అంటే ఈ సినిమా టైటిల్లోని అర్ధం.. తన బంధుమిత్రులను కూడా మరిచేంత మత్తు అనుకుంటా… ఈ మమ్ముట్టి సినిమా గురించి.. అక్కడా ఇక్కడా సోషల్ మీడియా పోస్టులను చూసి కంట పడితే ఒక కన్నేశా.. తొలి పది నిమిషాలు అత్యంత సాదాసీదాగా నడిచిన కథ… ఇదొక ట్రావెలింగ్ స్టోరీ అనిపించింది మొదట..
తమిళనాడులోని వెళాంగిణీ మాతను దర్శించడానికి వచ్చిన ఒక బృందం.. తిరిగి కేరళకు బయలు దేరుతుంది
ఆ ట్రావెల్ బస్సుకు హెడ్డు.. మమ్ముట్టీ.
ఇంత సాదాసీదా కథకు ఇంత పేరా? అనుకుంటుండగా.. ఒక ఊరిదగ్గర బస్సు ఆపమంటాడు మమ్ముట్టీ, అక్కడి నుంచి ఊళ్లోకి వెళ్లి.. ఆ ఊళ్లోని ఒకింట్లో మనిషిలా కలగలసి పోవడం, వారందరికీ తాను ఇది వరకే తెలిసిన వాడిలా వ్యవహరించడంతో అందరూ షాక్ షాక్ షాక్! ఆ ఇంటి ఇల్లాలికి ఒక కూతురు, భర్త పోయి రెండేళ్లు. తన భర్తలా ఇతడు అజమాయిషీ చెలాయించడమే ఈ సినిమాలోని మెయిన్ సోల్. ఇతడితో యాత్రకు వచ్చిన వాళ్లలో ఇతడి బంధు మిత్రులతో పాటు భార్యా పిల్లలు కూడా ఉంటారు, వీరిని కూడా గుర్తు పట్టకుండా ఊళ్లోని వాళ్లందరినీ తనకేదో తెలిసినట్టుగా పలకరించడం మాత్రమే కాదు అతడిలాగానే బిహేవ్ చేస్తు.. అతడు చేసే పనిపాటలను చేస్తూ గడిపేస్తుంటాడు.
దీంతో ఏం చేయాలో తోచక ఇటు అటు ఇరు వర్గాల వారు పిచ్చెక్కి పోతుంటారు, మమ్ముట్టితో పాటు వచ్చిన ఒక మేల్ నర్స్.. ఇతడికో పది గంటల పాటు నిద్రవచ్చేలాంటి మైకం ఇవ్వడంతో అతడా పాత్ర నుంచి తప్పుకోగా.. తన పాత జీవితం జ్ఞప్తికి రావడం.. ఆపై అందరూ ఒకరికొకరు దండాలు పెట్టుకుని తిరిగి బస్సెక్కడంతో ముగిసిపోతుందీ కథ.
ఇందులో దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, కొన్ని మాత్రమే మీడియం బాడీస్ ఉంటాయ్. ఆ బాడీస్ కోసం ఎదురు చూస్తుంటాయి కొన్ని ఆత్మలు, ఆ ఆత్మలు తిరిగే చోటుకు ఈ బాడీస్ గానీ వస్తే.. అవి వీటిని ఆశ్రయించి తాము అనుకున్న పనులు చేస్తుంటాయని దెయ్యాల సీత అనే నావల్లో అనుకుంటా చాలా కాలం క్రితం చదివాన్నేను. ఈ కథను చూస్తే సరిగ్గా అలాగే అనిపించింది, అలాగని ఈ సినిమా పని ఇక్కడితో ఐపోలేదు. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి మలయాళ హీరోలు ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ ను ఎంపిక చేసుకోవడం అసలు సిసలు పాయింట్. నిజంగా ఇలాంటి కథనాలను ఓకే చేయడం ఒక ఛాలెంజింగ్.
అదే ఇక్కడ మన హీరోలు సినిమాలను సినిమాల్లా కాకుండా తమ తమ రాజకీయ\ కౌటింబిక\ సామాజిక పగ ప్రతీకారాలను తీర్చుకోడానికి వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్య మన బడాహీరోలు నటించిన రెండు సినిమాలు దాదాపు ఇలాగే ఉంటాయ్, ఒకరు ప్రభుత్వాన్ని దూషించే డైలాగులు జొప్పించే యత్నం చేస్తే మరొకరు తన కుటుంబం జోలికి వస్తే తాట తీస్తామనే హెచ్చరికలు జారీ చేసేలాంటి సందేశాన్నివ్వడం మనకిక్కడ అగ్రహీరోల సినిమాలంటేనే ఈ డ్రాపింగ్స్ అధికం. ఒక కమల్ లాంటి విక్రం, ఒక మమ్ముట్టిలాంటి ఇలాంటిచిత్రం మన హీరోల నుంచి ఎప్పుడొస్తాయో కదా ?