Dasara Movie : నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు కన్నడనాట విపరీతమైన క్రేజ్ నెలకొందని.. ఈ సినిమా రైట్స్ కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేటును ఆఫర్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇది నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రానుందని.. ఈ సినిమాతో నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమాను కన్నడలో ఎవరు రిలీజ్ చేస్తారా.. అక్కడ ఈ సినిమా ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందా.. రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అనే విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
అమెరికాలో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. అమెరికాలో నాని దసరా సినిమా 600 స్క్రీన్స్ లో కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినిమాల్లో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజయిన మూడో సినిమాగా దసరా రికార్డ్ కొట్టబోతుంది. ఇది కేవలం తెలుగు స్క్రీన్స్ మాత్రమే. తమిళ్, హిందీ భాషలతో మరికొన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది దసరా సినిమా. అమెరికాలో ప్రత్యంగిర సినిమాద్ దసరా సినిమాని రిలీజ్ చేస్తుంది. అమెరికాలో మార్చ్ 29నే ప్రీమియర్ షోలు వేయబోతున్నారు.