నాడు.. సారు – కారు – పదహారు …… నేడు భారత రాష్ట్ర సమితి – ఇదంతా సాధ్యమేనా? కెసిఆర్ కి జాతీయ స్థాయికి విస్తరించేంతగా శక్తి ఉందా ? : ప్రత్యేక కథనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది.
కనెక్టివిటీ ప్రాబ్లం ఏమీ ఉండదా?, ఇందులో రెండు శుభశకునాలు, ఒక అపశకునం కనిపిస్తోంది.. ఆ రెండు శుభశకునాలు ఏంటంటే.. సౌత్ మూవీ ఉడ్ నుంచి ఒక విషయం అప్పు తెచ్చుకుంటే.. బాలీవుడ్ లో మేటర్ లేదని ఇటీవలి మన సినిమాలు గొప్పగా నిరూపిస్తున్నాయి..
శంకర్ తో మొదలైన ఈ పరంపర రాజమౌళితో విస్తరించి.. సుకుమార్ వంటి వారిని కలుపుకుని ఇపుడు ప్రశాంత్ నీల్ కూడా వచ్చి కలవడంతో
ఈ దక్షణాది దర్శకుల దండయాత్రకు ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో పడిపోయింది. ఉత్తరాది సినిమా.. ఏదో పొరబాటున దంగల్ లాంటి ఒకటి రెండు సినిమాలు ఫ్లూక్ లో కొట్టుకు రావడం తప్పించి.. లాగిపెట్టి కొడితే వెయ్యి రెండు వేల కోట్ల రూపాయల భారీ వసూళ్ల చిత్రాలను
టార్గెటెడ్ గా ప్రయోగించుట అనే ప్రక్రియ వాళ్లకు అబ్బినట్టే లేదు.. వంద కోట్ల నుంచి రెండు మూడు వందల కోట్ల దగ్గరే ఆగిపోతున్నాయి బీటౌన్ మూవీస్, కానీ అదే ఒక సౌతిండియన్ పాన్ ఇండియా మూవీ కొడ్తే అది వెయ్యి కోట్లను టచ్ చేస్తోంది.. రీసెంట్ హిట్స్ పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ చాప్టర్ టూలే అందుకు ఉదాహరణ.. ఓకే సినిమా వేరు, పాలిటిక్స్ వేరు అనొచ్చు..
ఇంకొక శుభ శకునం ఏంటంటే.. మోదీ కూడా తన మూడో సారి గెలుపు తర్వాతే.. దేశ రాజకీయాల వైపు వచ్చారు.. ఆ తర్వాత ఒకదాని మీద మరొక విజయం సాధిస్తూ అప్రహిత జైత్ర యాత్ర చేస్తున్నారు.. ఇంకో రెండు మార్లు కూడా మోదీయే అన్న అంచనాలున్నాయ్.. ఇదిలా ఉంచితే.. ఇంత భయంకరమైన కంచు కోటను కేసీఆర్ లాంటి బక్క మనిషి ఢీకొట్టగలరా? అటు వైపు చూస్తే.. బీభత్సమైన జాతీయ పార్టీ..
దానికి తోడు విశాలమైన హిందీ బెల్టు.. అన్నిటికన్నా మించి కట్టి పడేస్తున్న రామ్ నామ్.. ఇలాంటి భాష కానీ సెంటిమెంటు గానీ సారు వైపు లేవు.. దానికి తోడు మొన్నటికి మొన్న సారు- కారు- పదహారని గట్గిగా అనుకుంటే వచ్చిన సీట్లు పట్టుమని పది కూడా లేవు.. ఈ విషయంలో ఓటర్లు బీజేపీనే కాదు కాంగ్రెస్ నైనా నమ్ముతున్నారు కానీ.. పార్లమెంటు స్థాయిలో సార్ ని అంతగా నమ్మడం లేదని తేలిపోయింది..
ఇపుడీ అపనమ్మకం కాస్తా బీజేపీకి ఒక బండి సంజయ్, అరవింద్ వంటివారిని అందించడంతో పాటు అటు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డిలాంటి బలమైన ప్రత్యర్ధులను తయారు చేసిపెట్టింది. వీళ్లిపుడు గులాబీ తోటలోకి చొరబడి విపరీతమైన దాడులకు తెగబడుతున్నారు. దుబ్బాక, హుజూర్ నగర్, గ్రేటర్ వంటి టీఆర్ఎస్ కంచు కోటలను బద్దలు కొట్టి.. తమ వాపునే బలుపుగా ప్రదర్శిస్తూ.. మరింత రచ్చ రచ్చ చేసేస్తున్నారు.. కాబట్టి.. సారు తాను స్టేట్ కి పరిమితమై పోవచ్చు కదా? ఇక్కడే గట్టిగా కాన్ సన్ ట్రేట్ చేసి.. వీళ్ల తోకలు తెంచి వాతలు పెట్టి.. ఫుల్ కాన్ సన్ ట్రేషన్ చేయవచ్చు కదా? అన్నమాటలు కూడా బలంగానే వినిపిస్తున్నాయ్.. కానీ ఇక్కడ రెండు పాయింట్ల మీద సారు కారు ఢిల్లీ వైపునకు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పాలె.
పాయింట్ నెంబర్ వన్ తన కల్వకుంట్ల వారసుడైన రామారావును సీఎం కుర్చీ ఎక్కించాలంటే.. అక్కడ ఢిల్లీలో మనకంటూ ఏదో ఒక సీరియస్ ముచ్చటుండాలె.. ఇహ నేరుగా ఇలాంటి పిల్ల నాయకులతో ఢీకొట్టడం అంటే.. అది కేసీఆర్ కే పరువు తక్కువ వ్యవహారం..
తనది తెలంగాణ జాతి పిత హోదా,,, అదే బండి, రేవంత్ నిన్న కురిసిన వర్షానికి ఇవాళ మొలిచిన గడ్డి మొక్కల్లాంటి వాళ్లు.. ఇలాంటి వాళ్లను నేరుగా ఢీ కొట్టడం కేసీఆర్ రాజకీయ చాతుర్యం లెక్కలోకి రానే రాదు.. అందుకే ఈ ఢిల్లీ రూట్ మ్యాప్.. అందుకే ఈ ఇన్ డైరెక్ట్ టార్గెటింగ్..
నువ్విక్కడ టచ్ చేస్తే నేనక్కడ కెలుకుతా ఫార్ములా అప్లై చేస్తోంది సారులోని పొలిటికల్ పాదరసంలాంటి బుర్ర.. అందుకే ఢిల్లో కోటలో తమ పార్టీకి సొంత భవనం.. ఎగ్సెట్రా ఎగ్సెట్రా.. అట్ ద సేమ్ టైం.. కవితను కూడా రాజ్యసభకు పంపి.. అక్కడ కోఆర్డినేషన్ చేయించి.. తద్వారా మరో వారసురాలిని కూడా జాతీయ స్థాయి నాయకిగా తీర్చిదిద్దవచ్చు.. దీంతో స్వామికార్యం స్వకార్యం రెండూ పూర్తవుతాయి.. అందుకే ఇక్కడ పీకే ను తీసుకొచ్చి సర్వేలు చేయించి.. 90 సీట్లు గ్యారంటీ వంటి ఫీట్లు చేయిస్తోంది..
ఇవన్నీ అలా ఉంచండీ…భారతదేశం రేంజీ పార్టీ పెట్టాలంటే.. అందుకు తగ్గ ధన బలం ఉండాలిగా అన్నది మరొక్క పాయింటు.. బేసిగ్గా మన దగ్గర సుమారు వెయ్యి కోట్ల రూపాయల సిరి సంపదలున్నాయి కాబట్టి. ఫికర్ నా మత్ కరో. దానికి తోడు 60 లక్షల మంది కార్యకర్తల బలగం కూడా ఎలాగూ కలిగి ఉన్నాం కాబట్టి.. తలా ఒక చేయి వేస్తే.. మరింత ధన బలం చేకూరడం ఖాయం.. సో, నో ప్రాబ్లం అంటున్నారు సారు..
ఇక్కడింకో శుభశకునం కూడా ఉంది.. అదేంటంటే.. మోదీ కూడా సరిగ్గా తాను మూడో సారి గెలవడానికి సేమ్ పీకే సాయాన్నే తీసుకున్నారు కాబట్టి తాను కూడా హ్యాట్రిక్ కొట్టడానికి మంచి సెంటిమెంటల్ కోచే దొరికినట్టు లెక్క.. పీకే కూడా కాంగ్రెస్ అనే గంగలో పూర్తిగా మునిగి పోకుండా.. కేసీఆర్ వెంట నడవడానికే ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి.. ఇదొక మంచి విషయం… బీహార్ లో పుట్టి గుజరాత్ లో తొలిగా మెట్టి..
తర్వాత మోదీ కోసం దేశమంతా నమో ప్రచారం చేసి.. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో గ్రౌండ్ లెవల్ రిపోర్టులు గుప్పెట్లో పెట్టుకున్న పర్శనాల్టీ పీకే.. ఇక్కడ జగన్, స్టాలిన్ వంటి వారికీ గెలుపు బాట చూపించిన బహుదూరపు బాటసారి.. కాబట్టి.. ఇంకో మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తామంటే.. భారత రాష్ట్ర సమితికి బంగారు బాటలు పరచడానికి పీకే స్ట్రాటజీలు ఇవ్వడం కాయం.. ఇలా ఎటు చూసినా కేసీఆర్ కి అన్నీ మంచి శకునాలే కనిపిస్తుండే సరికి తన పార్టీ 22 వ ఏట అడుగు పెట్టిన శుభ సందర్భంగా.. కేవలం టెంటులు స్టంటులతో సరి పెట్టకుండా..
నేరుగా ప్రత్యామ్నాయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలనిస్తున్నారు సారు.
అయితే ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం కొండంత కనిపిస్తోంది.. మోదీ అంటే ఎక్కడో గుజరాత్ లో మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన విజయ పరంపర ఒక్కటి మాత్రమే సరిపోలేదు.. బీజేపీ జాతీయ పార్టీ వేదికగా నిలవడం వల్ల మాత్రమే ఆయనింతగా ఎదిగిపోయారు.. తాను తెలంగాణ రాష్ట్ర విభజన చేయడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన సెంటిమెంటు రగిల్చి.. రెండు సార్లు వరుస విజయాలను సాధించారు.. మూడో సారి కూడా.. ఎలాగోలా గట్టెక్కేయవచ్చు.. కానీ అది జాతీయ స్థాయికి విస్తరించేంతగా.. శక్తినిస్తుందా? అదింకో జీవిత కాల పోరాటం కదా? అన్న ఆలోచన బ్రేకులు వేస్తోంది.. వడ్ల గొడవను అడ్డు పెట్టుకుని ఢిల్లీ నడివీధుల్లో ధర్నాలు చేయగానే సరిపోతుందా? ఒకటి రెండు పథకాలను కేంద్రం కాపీ కొట్టగానే కేసీఆర్ ఎవరో తెలిసిపోతుందా? దేశ వ్యాప్తంగా నాడు ఇందిర పేరు ఆమె పార్టీ గుర్తు ఎలా ముద్ర పడిపోయిందో.. నేడు మోదీ ఎలా తన పేరునొక బ్రాండ్ చేశారో… కేసీఆర్ కి కూడా ఆ స్థాయిలో ఇమేజనరీ వర్కవుట్ చేయాలి.. అలా జరగాలంటే ఆయన ఫెడరల్ స్ఫూర్తి, గుణాత్మక భారత్ వంటి అంశాలు సరిపోతాయా? భారతదేశపు ఆత్మకు సరిపడా.. సిద్ధాంత పరమైన పోలీక అయితే ఉంది..
కానీ ఇపుడు దేశ వ్యాప్తంగా లౌకిక భావన లేదు.. హిందూ ఓటు బ్యాంకు రాన్రాను గట్టి పడుతోంది.. ఈ సమయంలో వారి ఓట్లను ఇటు వైపు తిప్పలాంటే.. వారిని మతపరంగా రెచ్చగొట్టడం వల్ల మాత్రమే సాధ్యం వారికిష్టం లేని చైనాతో పోలికలు పెట్టి అభివృద్ధి దిశగా అడుగులేయిస్తామనీ.. ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక సంపదను ట్రిపుల్ ట్రిలియన్ డాలర్ల దిశగా పరుగులు దీయిస్తామని వాళ్లతో అంటే.. నువ్వెవడ్రబయ్ మాకు చెప్ప డానికంటారు.. దానికి తోడు మోదీత్వను కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మోయట్లేదు.. ఒక విశ్వహిందూ పరిషత్, మరో భజరంగ్ దళ, ఇంకో ఆర్ఎస్ఎస్ వంటి సంఘ పరివారంతో పాటు.. బ్రాహ్మణ భావజాలం హిందూ భావజాలం ఇలా ఎన్నో మోదీని కాపు కాస్తున్నాయ్.. ఈ పరిస్థితుల్లో ఎంఐఎంతో అనుక్షణం అంటకాగుతారనే పేరున్న కేసీఆర్ ఆయన పార్టీ స్ఫూర్తిని ఈ మత జమానా ఒప్పుకుంటుందా? ఇప్పటికే ఉత్తరాది దక్షిణాది అంటూ వేరియేషన్ తీసుకొచ్చి మాట్లాడే మోదీ ఆయన పటాలం.. కేసీఆర్ లాంటి లౌకిక భావన గల నాయకుడ్ని ఓన్ చేసుకుంటారా? అందుకు ఆధారమేది? అందుకు తగిన స్కెచ్ ఏదీ? అందుకంటూ కేసీఆర్ దగ్గర ఒక్కటంటే ఒక్కటైనా బ్రహ్మాస్త్రముందా? అవసరమైతే దక్షిణా భారతదేశాన్ని చీల్చేస్తామంటూ ఒక మూమెంట్ తీసుకురాగలరా? అలాంటిదేదైనా ఆయన దగ్గర ఉపాయముందా? కనీసం హిందూ మూకలను రెచ్చగొట్టేలా.. పెరిగిపోతున్న ముస్లిం జనాభాకు దీటుగా మీరు కూడా ఓ నలుగురైదుగుర్ని కనండి.. పెరిగే ఖర్చుకు ఆదాయం ఎలా పెంచుకుంటామో మీరు కూడా అలాగే చేయమంటూ.. ఏదైనా మతపరమైన ట్రిక్కులు టెక్నిక్కులు ప్లే చేయగలరా ? తెలంగాణలో యాదాద్రి ఆలయాన్ని కట్టించి హిందూ ఓటు బ్యాంకును ఎలా ఆకర్షించే యత్నం చేస్తున్నారో.. చండీ యాగాలతో ఎలా తన ప్రభను మరింత పెంచుకున్నారో అలాగే భారతదేశ వ్యాప్తంగా తాను విస్తరించడానికి తగిన ఎత్తుగడ ఏదైనా ఉందా?
అదే కమలనాధుల చేతిలో.. ఒక మధుర, ఒక కాశీ అన్నిటికన్నా మించి ఒక అఖండ భారత్ లాంటి వజ్రాయుధాలున్నాయి.. కుప్ప కూలిపోతున్న లంక నుంచే అఖండ భారత్ విస్తరణ ప్రారంభించమంటున్నారు.. దేశంలో ఉన్న ముస్లిమ్ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి..
వాళ్ల నోట్లో వేలు పెట్టి జేబులో వేలు పెట్టి ఒంట్లో వేలు పెట్టి.. మనమీ బతుకు బతకడం కన్నా హిందువుగా మారిపోవడమే బెటర్ అనే నిర్ణయానికొచ్చేలా చేసి.. అలాంటి మతాయుధ కర్మాగారమేదైనా కేసీఆర్ ఆయన అమ్ముల పొదిలో ఉందా? అంటే అనుమానమే..
కేవలం వెయ్యి కోట్ల రూపాయల డబ్బు దస్కం, ఓ అరవై లక్షల మంది కార్యకర్తల బలం వీటితో 150 కోట్ల భారత జనాభాను ఆకర్షించడం సాధ్యమేనా? వీరిలో ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల జనాభా పట్టుమని పాతిక కోట్లుండవు.. మిగిలినదంతా అంటే సుమారు వంద కోట్ల హిందువులను ఆకర్షించే శక్తి మంత్ర కేసీఆర్ మనసులో ఎక్కడైనా దాగి ఉందా? వంటి అంశాలు ఒకటే వెనక్కు లాగుతున్నాయ్.. కానీ ఒక ప్రయత్నం చేస్తే తప్పే లేదు.. ఇక్కడి నుంచి అక్కడికి పాకడం అన్న ప్రయత్నం అయితే మంచిదే.. కానీ ఇందులో డెఫినెట్ గేమ్ ఉందా? అన్నదే ఇప్పుడు సమస్య.. అదే గానీ ఉంటే.. అయితే అటు లేకుంటే ఇటు అనే కాంట్ బట్ పొజిషన్ దేశ రాజకీయాల్లో ఏర్పడి.. కేసీఆర్ ద్వారా ఆ నష్టం జరగడం కంటే.. ఆయనకు కొంత కాలం దేశాన్ని అప్పగించడమే నయమన్న భావన యాంటీ మోదీ బ్యాచ్ తో పాటు దేశ జనాభాలో కూడా రావాలి.. అలా రావాలంటే.. అందుకు తగిన చక్రబంధాన్ని కేసీఆర్ ప్రయోగించాల్సి ఉంటుంది.. అలా జరగాలనే ఆశిద్దాం..
జై కేసీఆర్ – జైజై భారత్ – జైజైజై భారత రాష్ట్ర సమితి!!! ప్రత్యేక కథనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది.