Krithi Shetty : టాలీవుడ్ లోకి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి .. ఆ ఒక్క సినిమాతో కుర్రకారుల మనసు దోచేసింది. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో..కృతి శెట్టికి వరుస మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన బంగార్రాజు సినిమాలో నటించింది. సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే మూవీలో కూడా నటించింది. ప్రస్తుతం నాగ చైతన్య కి జోడీగా కస్టడీ అనే సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన అందమైన ఫోటోలతో యూత్ ని ఫిదా చేస్తుంది.