మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ఈసీ మెంబర్ల కౌంటింగ్ ముగిసింది. ఉత్కంటభరితంగా సాగిన మా ఎలక్షన్స్ లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న మంచు విష్ణు ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్‌లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉండగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8మంది సభ్యులు లీడ్‌లో ఉన్నారు. క్షణక్షణానికి లీడ్స్ మారుతున్న నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠగా మారాయి.
భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ ఆనందంలో ఉన్నారు.
మంచు విష్ణు ప్యానల్‌లో 10 మంది విజయం
మంచు విష్ణు ప్యానల్ నుంచి 9 మంది ఈసీ సభ్యులు విజయం సాధించారు. 1. మాణిక్, 2. హరినాథ్, 3. బొప్పన,శివ, 4. జయవాణి, 5. శశాంక్, 6. పూజిత, 7. పసునూరి, 8. శ్రీనివాస్, 9. శ్రీలక్ష్మీ గెలుపొందారు.
మోహనబాబు గారి కుమారుడు తండ్రికి తగ్గ తనయుడు…. మా విష్ణు బాబుని
ఎంతో మంది మేధావులు తొక్కాలని చూసిన … బంతిలాగ పైకి ఎగిరి ఆత్మ ధైర్యంతో ముందుకు వెళ్ళి విజయ పతాకం ఎగుర వేసిన మా మంచి మంచు విష్ణు బాబు కి హృదయపూర్వక అభినందనలు,