Manipal Hospital : తమ అవయవాలు, కాలేయాలు లేదా కిడ్నీ లో కొంత భాగాన్ని తమ కుటుంబ సభ్యులకు దానం చేసే వారిని సజీవ దాతలు అంటారు. వీరు ధైర్యశీలులు, సమర్థులు మరియు త్యాగధనులైన మహిళలు, వీరు తమ దృఢ సంకల్పం, వైద్యం, విశ్వాసం, కృషి ద్వారా తమ కుటుంబాన్ని ఎవరు ఊహించలేనటువంటి సంక్షోభాల నుండి బయట పడేయగలుగుతారు. మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, సౌత్ ఏషియన్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ టీమ్ సంయుుక్తంగా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పటల్ ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో అవయవదానం చేసిన మహిళలను ఘనంగా సత్కరించారు.
ఈరోజు మనం మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మహిళలు లేకుండా మన జీవితం అనేది లేదు.
కుటుంబంలో అమ్మ, అక్క, చెల్లి, హాస్పిటల్స్ లో మహిళా డాక్టర్లు, నర్సులు, మాల్స్ లో మేనేజర్లు , సేల్స్ లేడీస్,
టెలి కాలర్స్ ఉద్యోగాలు చేసే మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో ఇలా చాలా మందే ఉంటారు. వీరు లేకుండా మన జీవితంలో ఒక్క పూట కూడా గడవదు. అయితే అలాంటి వారికి సరైన గుర్తింపు ఇప్పటికీ దగ్గడం లేదు. అయిదే మణిపాల్ హాస్పిటల్, విజయవాడ అలాంటి వారి ఈ ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తుంది.
ఈ సందర్భంగా సౌత్ ఏషియన్ ఫర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు, సీనియర్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జన్ ప్రొఫెసర్. టామ్ చెరియన్ మాట్లాడుతూ.. “ఇటీవల కాలంలో మహిళలు అన్నీ రంగాల్లోనూ రాణిస్తున్నారు. అంతేగాకుండా వారు అనుకున్న రంగంలో నిరంతరం శ్రమిస్తూ వారికంటూ ఓ గుర్తింపు పొందుతున్నారు. వీరంతా వీరమహిళలే.. అయితే వీరికి ఏమాత్రం తీసిపోని వారు కూడా ఉన్నారు. వారే మహిళా ఆవయవ దాతలు. నేను ఇలాంటి మహిళల పట్ల గౌరవాన్ని కలిగివున్నాను. వీరికి ప్రత్యేక గుర్తింపు అనేది ఏం ఉండదు. నిజానికి వారి ఆ గుర్తింపును కూడా కోరుకోరు. వారు కోరుకునేదల్లా ఎదుటి వారు బాగుండడమే.
ఇందుకోసం వారి శరీరంలోని అవయవాలను దానం చేయడానికి కూడా వెనుకాడరు. తమ వారికి ఆపద వచ్చినప్పుడు వారు అవయవదానానికి ముందుకు వస్తుంటారు. కాలేయ మార్పిడి రోగులకు చివరి ఎంపికగా మాత్రమే చేయబడుతుంది. సమయానికి కాలేయ గ్రహీతలు బాగా అనారోగ్యంతో ఉండటంతో పాటు చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో అదే కుటుంబంలోని ఓ వ్యక్తి కాలేయదానం చేసి కాపాడుతారు. ఇలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్ కు తప్పనిసరిగా నియమ నిబందనలు పాటించడం, ధృవపత్రాలను, ఆర్థికవిషయాలను సమన్వయ పరుచుకుని సర్జరీలు చేస్తారు. అయితే ఇలా అవయవదానం చేసే మహిళలను నిజమైన కధానాయికలుగా చెప్పవచ్చు. దేశంలో 75% మార్పిడి ఈ విధంగానే జరుగుతున్నాయి. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించి బ్రెయిన్ స్టెమ్ డెడ్ అయిన వారి నుంచి అవయవ భాగాలు సేకరించగలితే ఇలాంటి మహిళలు వారి అవయవ భాగాలను దానం చేయాల్సిరాదు.”
విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ.. “అవయవదానం చేసిన వీరమహిళలు మణిపాల్ హాస్పిటల్ తో కలిసి ఉన్నందుకు గర్విస్తున్నాను. మేము చేసే ఈ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకుని వస్తున్నందుకు ఆనందంగా ఉంది.”