Maunam Movie, Thammareddy Bharadwaj, Latest Telugu Movies, Hero Murali, Heroine Bhanusri, Director Kishan Sagar, Telugu World Now,
FILM NEWS: ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసిన “మౌనం” ప్రచారచిత్రం!!
లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ఆహ్లాదభరిత ప్రేమకథాచిత్రం “మౌనం”. “పవర్ ఆఫ్ సైలెన్స్” అన్నది ట్యాగ్ లైన్. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా… “మల్లెపువ్వు” ఫేమ్ మురళి- “వరుడు” ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి… మణిరత్నం “మౌనరాగం” తరహాలో రూపొందిన “మౌనం” మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత-ఊర్వశి ఓటిటి సీఈఓ రామ్ తుమ్మలపల్లి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈనెలాఖరుకు లేదా సెప్టెంబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ… “మౌనం” కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే చిత్రం “మౌనం”. ఈనెలాఖరుకు కానీ, సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్ లో కానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. “మౌనం” ట్రైలర్ విడుదల చేసిన తమ్మారెడ్డిగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు. ఐశ్వర్య అడ్డాల, ‘శివ’ ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కథ: అనిల్, సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి, నిర్మాతలు: అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి, ఛాయాగ్రహణం-దర్శకత్వం: కిషన్ సాగర్!!