మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న భోళా శంకర్ సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. నవంబర్ 15 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
అన్నాచెల్లెళ్ల బంధం చుట్టు తిరిగే ఈ కథలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి సరసన నటించే హీరోయిన్ పేరును అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
నటీనటులు : మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్
సాంకేతిక బృందం :
డైరెక్టర్ : మెహర్ రమేష్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్,
మ్యూజిక్ : మహతి స్వర సాగర్