Megastar Chiranjeevi : దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా లెవల్లెనో కాకుండా.. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. తాజాగా రామ్ చరణ్.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొనడానికి అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా 3లో పాల్గొన్నారు రామ్ చరణ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
గుడ్ మార్నింగ్ అమెరికా 3 షోకు హాజరైన మొదటి తెలుగు స్టార్ అయిన చరణ్ అనే చెప్పాలి. అమెరికా వెళ్ళే ముందు వరకు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న చెర్రీ.. అమెరికా వెళ్ళాక ఆకక్దే ఒక ఆలయంలో స్వామి మాల తీసినట్లు తెలుస్తుంది. గ్రే బ్లేజర్, మ్యాచింగ్ ట్రౌజర్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే బ్రౌన్ షూస్.. సన్ గ్లాసెస్ తో ఫుల్ స్మార్ట్ లుక్ లో అదిరిపోయాడు చెర్రీ.
ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి కూడా తన పుత్రోత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇండియా తరుపు నుంచి రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం ఇది. ఇటువంటి అవకాశాన్ని తీసుకువచ్చిన మాస్టర్ మైండ్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే ఉపాసన చిన్నమ్మ సంగీతారెడ్డి కూడా.. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అల్లుడు’ అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి చరణ్ మానియాతో సోషల్ మీడియా ఊగిపోతుంది.