Minister Harish Rao Comments on BJP Party, CM KCR, TRS Party, Huzurabad News, Etela Rajender, Telangana Poltical News, Telugu World Now,
Telangana News: ఇచ్చేది తెరాస ప్రభుత్వం… చెప్పుకునేది బీజేపీ. చిటికెడంతా ఉప్పువేసి…పప్పంతా నాదేనన్న తీరు బీజేపీది.
అంగన్ వాడీలకు కేంద్రం ఇచ్చేది రూ.2700/ మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ. 10,950/.
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అంగన్ వాడీ టీచర్ జీతం, మన రాష్ట్రంలో ఆయాలకిచ్చే మొత్తంతో సమానం.
దేశంలో అంగన్ వాడీలకు అత్యధిక జీతాలు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
హుజూరాబాద్ అంగన్ వాడీల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ రావు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్
దేశంలో అంగన్ వాడీ టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తోంది తెలంగాణ మాత్రమే.
ఒకప్పుడు జీతాలు పెంచాలని ధర్మాలు రాస్తారోకోలు లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి అంగన్ వాడీ టీచర్లు, ఆయాలది.
జీతం పెంచమని అడిగితే గుర్రాలతో తొక్కించిన పాలకులు నాడు. నేడు ప్రగతి భవన్ కు పిలిచి జీతాలు పెంచిన పాలకుడు సీఎం కేసీఆర్.
ఏడేళ్లలో సీఎం కేసీఆర్ మూడుసార్లు వేతనం పెంచారు.
అంగన్ వాడీలకు జీతాలు పెంచితే ప్రభుత్వానికి ఆర్థిక భారమని అధికారులు అంటే, పట్టు పట్టి జీతాలు పెంచాల్సిందేనన్న ముఖ్యమంత్రి కేసీఆర్.
రాష్ట్రం ఏమిచ్చినా మా కేంద్రమే ఇస్తోందని బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.
అంగన్ వాడీల జీతంలో కేంద్రం ఇస్తోంది కేవలం 2700 / మాత్రమే.
రాష్ట్ప ప్రభుత్వం ఇస్తోంది 10,950/రూ.
గొప్పగా మాటలుచెప్పే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అంగన్ వాడీ టీచర్ల జీతం రూ. 7800 / మాత్రమే. ఆయాల జీతం రూ. 3950/ మాత్రమే.
తెలంగాణ లో ఆయాలకు వచ్చే జీతం, గుజరాత్ లో అంగన్ వాడీ టీచర్లకు ఇస్తున్నారు. ఇదీ బీజేపీ పాలన .
అంగన్ వాడీలలో ప్రతీ ఏటా పిల్లలు పెరుగు తున్నారు. వారి సంఖ్య దృష్ట్యా బడ్జెట్ పెరగాలి. కాని గత బడ్జెట్ లో కేంద్రం శిశు సంక్షేమ శాఖ కు 18 శాతం నిధులను కోత పెట్టింది.
గత బడ్జెట్ లో 29,540 కోట్లు కేటాయిస్తే, ఈ బ్డజెట్ లో కేంద్రం 24 వేల కోట్లకు తగ్గించింది.
బీజేపీ మాత్రం అబద్దాలు ప్రచారం చేస్తబ ప్రజలను మోసం చేస్తున్నారు.
గ్యాసి సిలిండర్ ధర రూ950/ కు పెంచడమే కాకుండా సబ్సిడీని 40 రూ తగ్గించింది. త్వరలో అది కూడా ఎత్తివేస్తుంది.
గ్యాస్ ధరలు పెరగుదలకు రాష్ట్ర ప్రభుత్వం 350 రూ ట్యాక్స్ వేస్తున్నట్లు దుష్ప్రాచారం చేస్తోంది.
గ్యాస్ పై జీఎస్టీ ఐదు శాతం మాత్రమే. అంటే 45 రూ. మాత్రమే. ఇందులో కేంద్రం జీఎసిటీ ఉంది.
బీజేపీ కోతలు వాతలు వేస్తుంటే తెరాస. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.
పెన్షన్ 200నుండి 2016 కు పెంచింది. కళ్యాణ లక్ష్మి పేరుతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి లక్ష నూటా పదహార్లు ఇస్తోంది.
వీటిని ఓ మాజీ మంత్రి పరిగె ఏరుకోవడం, ఆసరా దండగ అని , రైతు బంధు కడుపు నిండదని తప్పుడు మాటలు మాటలాడుతున్నారు.
అంగన్ వాడీ టీచర్ల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆర్.
అంగన్ వాడీటీచర్లు, సూపర్ వైజర్లుగా పదోన్నతులు పొందేలా ఉత్తర్వులు వచ్చేలా చూస్తాం.
జీతాలు నెల మొదటి వారంలో వచ్చేలా కృషి చేస్తా.
విద్యావ్యవస్థలో అంగన్ వాడీలను మిళితం చేసి బలోపేతం చేయాలన్నది సీఎం కేసీఆర్ గారిఆలోచన.
అర్హులైన అంగన్‌వాడీలలో పేద లకు డబుల్ బెడ్ రూం ఇల్లు .
మాజీ మంత్రి నిర్లక్ష్యం వల్ల ఒక్క ఇల్లు ఇక్కడ కట్టలేదు.
ఏదైనా చేసింది కేసీఆరే. భవిష్యత్తులో చేసేది కేసీఆరే.