Minister Harish Rao Pressmeet, Huzurabad By Elections, CM KCR isued Dalita Bandhu Scheme Checks From Huzurabad, Gangula Kamalakar, Telangana Poltical News, Telugu World Now,
Telangana News: పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ లో సీఎం చేతులమీదుగా దళిత బందు: ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
అర్హులైన దళితులందరికీ దళిత బందు. దళిత బంధును ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారు. దళిత బంధు కార్యక్రమం ఎల్లుండి సీఎం హుజురాబాద్ లో ప్రారంభిస్తారు, పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ ను దళితబంధు కోసం ఎంపిక చేసారు. బీజేపీ నాయకులు కొన్ని సంఘాల నాయకులు ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కన్ఫ్పూజన్ క్రియేట్ చేస్తున్నారు. హుజురాబాద్ లోని ప్రతి కుటుంబానికి దళితబంధు అందిస్తాం. ఎవరి చెప్పుడు మాటలు వినొద్దు, రైతు బంధు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించినప్పుడు కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసారు. కానీ కరోనా కష్టకాలంలోనూ నిరాటంకంగా రైతు బంధు రెండు పంటలకు ఇస్తున్న సంగతి తెలిసిందే.
రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు పథకాలపై అనుమానాలు సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పైలట్ కింద దళిత బంధును హుజురాబాద్ లో అమలు చేయడానికి 2వేల కోట్ల కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ 2వేల కోట్లతో 20 వేల కుటుంబాలకు దళిత బంధు లబ్ధి చేకూరుతుంది. ఎన్నికలప్పుడే ఈ పథకం తెచ్చారంటున్నారు. కానీ ఆర్థిక మంత్రిగా నేనే ఈ పథకం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టాను. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ ప్రారంభిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు ఇది అదనమని ఆనాడే చెప్పాం. అప్పుడు హుజురాబాద్ ఎన్నికలు లేకున్నా మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారు. ఆర్థిక మంత్రిగా నేనే రాష్ట్ర అసెంబ్లీలో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం అమలు చేస్తామని ప్రకచించాను. ఇదే హుజురాబాద్ లో రైతు బంధు ప్రారంభిస్తే ఒప్పు, ఇప్పుడు దళిత బంధు తప్పెలా అవుతుంది.
ఏ నాయకుడైనా, ప్రజాప్రతినిధి అయినా తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే సంతోషిస్తారు, ఆహ్వానిస్తారు. ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతారు. కానీ దురదృష్టవాశాత్తు ఇక్కడ నిరసలను చేపిస్తున్నారు. మనసులో ఉన్న అక్కసును వెళ్లగక్కుతూ, కుట్రలు, కుతంత్రాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రేమ ఉంటే మరో 10 లక్షలు కేంద్రం నుంచి తెచ్చి ఇవ్వండి. కాకుంటే 20 లక్షలు ఇవ్వండి. బండి సంజయ్ 50 లక్షలు ఇవ్వాలని అంటున్నారి. మాకు చేతనైనంత మట్టుకు పది లక్షలు ఇస్తున్నాం. మరో 40 లక్షలు అదనంగా కేంద్రంనుండి తెచ్చిస్తే మీకు, మోడీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు.
రాష్ట్రంలోని ప్రజలకు 50 లక్షలు వస్తే మేమెంతో సంతోషిస్తాం. ఆహ్వానిస్తాం. మీలా అడ్డుకోం. వచ్చే ఏడాది బడ్జెట్ పెంచుకుని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయబోతున్నాం. మీరు 40 లక్షలు ఇస్తే.. ప్రజలు మీకే మద్ధతు పలకుతారు. కానీ మీలాగా మేము కుట్రలు చేయము, అడ్డుకోము. ఎల్లుండి జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కుల అందిస్తాం. ప్రత్యేక అధికారులతో గ్రామసభలు నిర్వహించి, ప్రజల మధ్యే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. సర్పంచి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందరికీ దళిత బంధు ఇస్తాం. నియోజకవర్గంలోని ప్రతి అర్హునికీ ఒకే దఫాలో దళిత బంధు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దళిత బంధు ఇచ్చి తీరుతాం. ఇచ్చిన ఒక్కో మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాం, రైతు బంధు, నిరంతర విద్యుత్, ఇంటింటికి మిషన భగీరథ నీరులాంటివన్నీ అమలు చేస్తున్నాం.
70 ఏళ్లలో చేయలేని మిషన్ భగీరథ పనిని ఏడేళ్లలో పూర్తి చేసి అందరికీ తాగునీరు ఇస్తున్నాం. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కొంత వెనకాముందైనా.. అన్నీ అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రైతు రుణమాఫీ ఇప్పటికే 25 వేల లోపు చేసాం, ఇప్పుడు 50 వేల లోపు 6 లక్షల మంది రైతుల రుణాలు మాఫీచేయబోతున్నాం. కరోనాతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అయినా కూడా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మా ప్రభుత్వం ముందే ఉంది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఆరు నూరైనా ప్రతి కుటుంబానికి దళిత బంధు అమలు చేసి తీరుతాం. ఈరోజు తాత్కలిక ఆనందం మీరు పొందొచ్చు కాక… దళిత బంధు డబ్బు వచ్చాక అది మీకే అర్థ అవుతుంది. మీరు సోషల్ మీడియాలో పెట్టి ఆనందం పొందొచ్చు.. కానీ ఆ తర్వాత అది మీకే రివర్స్ అవుతుంది. నిజంగా మీకు దళిత జాతి మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి 40 లక్షలు తెచ్చి ఆ ప్రేమను నిరూపించుకోవాలి. బండి సంజయ్ 50 లక్షలు ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు మేము హుజురాబాద్ కు 2 వేల కోట్లిచ్చాం. మీరు 8 వేల కోట్లు తీసుకురండి.. అందరికీ 50 లక్షలు ఇద్దాం.
మీరు తేకపోగా.. చేసే ప్రభుత్వాన్ని, అందే సహాయానికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే దళిత జాతి మీకు వ్యతిరేకమవుతుంది. దళిత జాతిలో గుణాత్మమైన మార్పు తేవాలని ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. ఆర్థిక స్వావలంభన తేవాలని, వారి కాళ్లపై వారు నిలబడాలని ఈ స్కీం తెచ్చాం. ఇంత అద్భుతమైన పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే ఆ కుట్రల్లో మీరే మసై మాడిపోతారు. దళిత బంధులాంటి మంచి పథకాన్ని మీ బీజేపీ తరపున ఇప్పటి వరకు ఆహ్వానించారా? నేనేదో పెద్ద లీడర్ నని చెప్పుకుంటున్న ఇక్కడి నాయకుడు కనీసం కృతజ్ఞత చెప్పాడా? మీ నియోజకవర్గంలోని 20 వేల కుటుంబాలకు లబ్ధి పొందుతుంటే , అడ్డుకోవాలని చూస్తే మాడి మసై పోతారు. దళిత సోదరులు అపోహలు, పుకార్లు నమ్మొద్దు. ఆరు నూరైన అర్హులైన ప్రతి కుటుంబానికి దళిత బంధు అంది తీరుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల కమిషన్ కు దళిత బంధు ఆపాలని ఉత్తరాలు రాస్తున్నారు. దళిత బంధు ఆపాలని హైకోర్టులో కేసులేస్తున్నారు. దళిత జాతి మొత్తం ఈ వ్యవహారాలను గమనిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారనేది వారు తెలుసుకుంటున్నారు. ఇచ్చి తీరాలన్న సంకల్పంతో మేముంటే.. ఆపాలని కొందరు చూస్తున్నారు. ఇది ఆపితే నష్టం మాకు కాదు.. దెబ్బ మీకే తగులుతుంది. దళిత బిడ్డలంతా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండండి. అధికారులు మీ ఊరికి, మీ వార్డుకు వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈనెల 16 న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం సభకు వస్తారు. 4 గంటల వరకు సభ జరుగుతుంది.
హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లిలోని దళిత బస్తీలో గెల్లు శ్రీనివాస్ కు ఉండగా ఉంటామని ఏకగ్రీవంగా మద్ధతు ప్రకటించారు. వాళ్లు స్పష్టంగా ఉన్నారనడానికి అది ఓ ఇండికేషన్. దసరా రోజు పాలపిట్టను చూసేందుకు వెళ్లినంత సంబరంగా దళిత బంధు సభకు వస్తామని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్టు లక్ష్మన్ రావు కు సంతాపం ప్రకటించిన హరీశ్ రావు, లక్ష్మన్ రావు కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటాం. జర్నిలిస్టు సహకారం ఎల్లవేళలా ఉండాలి. ప్రభుత్వ సహకారం కూడా మీకు ఉంటుంది. జర్నలిస్టులుగా మీరు ధర్మాన్ని కాపాడాలి. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు.