రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర క్రీడా పాఠశాల (హకీమ్ పేట)కు చెందిన D. గణేష్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని జైన్ యూనివర్సిటీ లో ఈ నెల 23 నుండి 27 వరకు జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ 81 KG విభాగంలో సిల్వర్ మెడల్ సాదించిన సందర్భంగా, అలాగే, అర్చరీ లో SAI NCOE స్కీమ్ లో హర్యానా సోనిపట్ కు ఎంపికైన S. శ్రీను, K. అభినయ్, కోల్కతా SAI NCOE కి ఎంపికైన శివ సాయి లను అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ డా. హరికృష్ణ , కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.