Minister V Srinivas Goud, State Gallery of Art, Adya Kala, Telangana Yathnic Arts Exbition, Prof Jayadheer Tirumal Rao, Telangana News, Telugu World Now,
“ఆద్య కళ” పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్క వస్తువుకు ఎంతో చరిత్ర ఉంది: మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో “ఆద్య కళ” తెలంగాణ యత్నిక్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పేరుతో ప్రో. జయధీర్ తిరుమల రావు గారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు.
అనంతరం మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే పురాతన వారసత్వ వస్తువు సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనాటి అరుదైన వస్తు సంపదను సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని భద్రపరస్తామన్నారు. ఆదివాసీ, గిరిజన, జానపదలు వినియోగించిన పలు వాయిద్య పరికరాలు, కళారూపాలు, వివిధ ఆకృతులను ఒక్క చోట చేర్చి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రదర్శనలోని వాయిద్య సాధనాలు, విగ్రహాలు, వివిధ ఆకృతులు, చిత్రాలను భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇలాంటి ఆరుదైన వస్తువు సందపకు వెలకట్టలేమని పేర్కొన్నారు.ఇందుకోసం కృషి ప్రొ. జయదేవ్ తిరుమలరావు బృందానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు.
ఆద్య కళ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్క వస్తువుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ప్రాచీన నాగరికత, అధి మానవుని కాలంలో ఉపయోగించిన వస్తువుల నుండి నేటి మన పూర్వీకులు ఉపయోగించిన వస్తువుల పరిణామ క్రమం ఎంతో సవివరంగా సేకరించిన వివిధ రకాల సంగీత వాయిద్యాలు, కాలపత్ర గ్రంధాలు, కళా కృతులు, గిరిజనులు ఉపయోగించిన వెల కట్టలేని సంపద కలిగిన కళా ఖండాలను ఈ ప్రదర్శన లో ప్రదర్శిoచారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను చూసి చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. సీఎం కేసీఆర్ గారు వచ్చిన తరువాత తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను వెలికితీసేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రో. జయధీర్ తిరుమల రావు గారు సేకరించిన ఈ చరిత్రాత్మక సంపద ను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం తరుపున తన వంతు సహకారం అందిస్తామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు శ్రీ K. శ్రీనివాస్, ప్రో. మనోజా, డా. పృథ్వి, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డా K. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.