Minister V Srinivas Goud, Telangana Gouds Sangam, Tholi Bahujana Chakravarthy Sardar Sarai Papanna Goud 371 Jayanathi, Telangana News, Telugu World Now,
Telangana Poltical News: తొలి బహుజన చక్రవర్తి “శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్” గారి 371వ జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తొలి బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 371వ జయంతి సందర్భంగా ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లోని చిక్కడపల్లి లో నిర్వహించనున్న జయంతి సభ వాల్ పోస్టర్ ను సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ గారితో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మూడు వందల యాభై (350) ఏళ్ల క్రితమే అన్ని మతాలను, కులాలను ఐక్యం చేసి 33 కోటలను జయించి ప్రజా సంక్షేమానికి కృషి చేసిన గొప్ప బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని వెల్లడించారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కల్లు దుకాణాలను తెరిపించి గౌడ్ ల ఆత్మ గౌరవాన్ని పెంచారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. గీత వృత్తిదారుల సంక్షేమానికి అభివృద్ధికి అనేక కార్యక్రమాలను నిర్వహించడం తో పాటు గీత కార్మికుల వృత్తి పన్ను ను రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కిందన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్టు పైనుండి పడి శాశ్వత అంగవైకల్యం, మరణించిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియో ను 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచి గీత కార్మికులను వారి కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. వీటితోపాటు హరితహారం లో భాగంగా తాటి ఈత మొక్కలను నాటి గీత వృత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ గారు గీత కార్మికుల సంక్షేమానికి ప్రతిష్టాత్మకంగా “నీరా పాలసీ” ని ప్రవేశపెట్టి గౌడ్ లకు ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహిస్తున్నారు.
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 371 వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులైన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, MLC లు గంగాధర్ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్, MLA లు ప్రకాశ్ గౌడ్, వివేక్, మాజీ MP లు డా. బూర నర్సయ్య గౌడ్, మధు యాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, తదితర ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు కమిటీ ఛైర్మన్ శ్రీ బాలగొని బాలరాజు గౌడ్. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి కార్యక్రమంలో గీత వృత్తిదారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ వర్కింగ్ వైస్ ఛైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, కో – ఆర్డినేటర్ సింగం సత్తయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.