ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ‘మే’ డే వేడుకలలో రాష్ట్ర మంత్రులు శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి గార్లు రాష్ట్ర కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తన్నామన్నారు. రాష్ట్రంలో మంత్రి KTR గారి రూపొందించిన TS ipass పాలసీ వల్ల పారిశ్రామిక వేత్తలు వల్ల అనేక నూతన పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తన్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు వల్ల పవర్ హాలిడే వల్ల కార్మికులు ఎంతో నష్టపోయారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సుమారు 14 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారన్నారు. నేడు సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నూతన పరిశ్రమల స్థాపన వల్ల వలస వెళ్లిన కార్మికులు వెనక్కి వస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ల నుండి రోజుకు 30, 40 వేల మంది కార్మికులు వలస వస్తున్నారన్నారు. సమర్ధవంత నాయకుడు సీఎం తెలంగాణ రాష్ట్రానికి ఉండటం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు తమ ప్రాంతాన్ని తెలంగాణ లో కలపాలని ఆ ప్రభుత్వాలను కోరుతున్నారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మరో సారి కార్మికులు దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.