Nagarjuna Akkineni:అక్కినేని నాగార్జున సినిమా వచ్చి చాలా రోజులైంది. చివరగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఘోస్ట్’ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ డిజాస్టర్ కాగా అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు నాగ్. అయితే ఓ స్టార్ రైటర్ డైరెక్షన్లో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆర్ఎక్స్100 డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘మన్మథుడు2’ డిజాస్టర్ తర్వాత కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రం పర్వాలేదనిపించింది. కానీ ‘ఘోస్ట్’ మూవీతో మరో ఫ్లాప్ చవిచూసిన నాగ్.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో అనేక కాంబినేషన్లు తెరపైకి వచ్చినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేకించి ‘ధమాకా, ధమ్కీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) దర్శకత్వంలో సినిమా ఉంటుందని ఆల్మోస్ట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆర్ఎక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతి (RX100 Director Ajay Bhuapathi) చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రసన్న కుమార్ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.
హీరో పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దడంతో నాగార్జున ఈ స్టోరీ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు ఈ సినిమాను తమ హోమ్ బ్యానర్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌లోనే నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇక అజయ్ భూపతి విషయానికొస్తే.. మొదటి చిత్రం RX100తోనే డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో సినిమాగా శర్వానంద్, సిద్ధార్థ్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కించిన ‘మహాసముద్రం’ మాత్రం నిరాశపరిచింది. దీని తర్వాత అజయ్ సొంత ప్రొడక్షన్లో ‘మంగళవారం’ అనే చిత్రాన్ని రూపొందించగా.. త్వరలోనే విడుదల కానుంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ పోషించింది.