Nagarjuna Sagar MLA Nomula Bhagath Oath Ceremony, Pocharam Srinivas Reddy, Talasani Srinivas Yadav, Telangana Poltical News, Telugu World Now,
Telangana Poltical News: నాగార్జునసాగర్ MLA నోముల భగత్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉప ఎన్నికల్లో నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు నోముల భగత్ చేత శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
శాసనసభ భవనంలోని సభాపతి గారి చాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనసభ్యులు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి. లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు. అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు.