NRI TRS President Anil Kurmachalam, Telangana State BJP President Bandi Sanjay Kumar, Telangana Political News, Telugu World Now,
Telugu World News: బండి సంజయ్ చేయవలసింది పాదయాత్ర కాదు ఢిల్లీ యాత్ర – ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర వారి పార్టీలో ఆధిపత్యపోరులో భాగమేనని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నష్టమేమి లేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే ఆదర్శంగా ఉందని, ఎన్నో సందర్భాల్లో కేంద్రంలోని బిజెపి మంత్రులే ప్రశంశించారని బండి సంజయ్ కి గుర్తు చేశారు.
ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టేముందు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఎన్ని నిధులు ఇచ్చిందో లేక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కేంద్రంతో మాట్లాడి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని అనిల్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ బిడ్డగా అడుగుతున్నాను స్థానిక ఎంపీగా కరీంనగర్ కి ఎన్ని నిధులు తెచ్చారని, కరీంనగర్ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏముందని అనిల్ ప్రశ్నించారు.
ఇలా అడుగడుగునా ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని, అబద్దాలు ప్రచారం చేసి ఒకటో రెండో సీట్లు గెలిచినట్టు కాదని ప్రజల దగ్గరకు వెళ్ళడమంటే, తెలంగాణ ప్రజలు చైతన్యువంతులని, ఉద్యమం చేసిన ఉద్యమకారులని, అడుగడుగునా మీకు భంగపాటు తప్పదని అనిల్ హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటే , మరి ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలల్లో ఎందుకు ఇవే పథకాల్ని అమలు చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు . అబద్ధాలని ప్రచారం చేసి ఎక్కువరోజులు ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరని మీ నిజస్వరూపం ఇప్పటికే ప్రజలకు అర్థమైందని అందుకే ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పారని అనిల్ తెలిపారు.
బిజెపి పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్తూనే ఉన్నారని, ప్రజల్లోకి వెళ్తే తగిన బుద్ది చెప్తారని, ఇప్పుడు బిజెపి నాయకులు చెయ్యవలసింది పాదయాత్రలు కాదని , ఢిల్లీ యాత్రలు చేసి రాష్ట్రానికి రావలసిన నిధుల్ని, విభజన హామీలను నెరవేర్చే విధంగా కృషి చెయ్యాలని హితవు పలికారు.
తెలంగాణ ప్రజలంతా ఎక్కడికక్కడ బిజెపి నాయకులని నిలదీసి, ఏడు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి వారి చేసిన సహాయం ఏంటో అడగాలని తెలిపారు.
అలాగే పదవికి తగట్టు భాషను సవరించుకుంటే అందరికి మంచిదని లేకుంటే ఒక్కసారి తెరాస నాయకులు, కార్యకర్తలు మీలాగే ప్రవర్తించడం మొదలు పెడితే తట్టుకోలేరని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులని, ఎమ్మెల్యేలను సంబోధించేటప్పుడు సంస్కారంగా ప్రవర్తించాలని ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.