Entertainment బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తాజాగా వైరల్ కామెంట్స్ చేశారు. పెళ్లి గురించి మాట్లాడుతూ నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ అదొక్కటే సమస్య అంటూ చెప్పుకొచ్చారు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ఏం చేస్తాం నాకు మింగిల్ అవ్వాలని ఉన్న నేను సింగల్ కాబట్టి అవ్వలేకపోతున్నాను అంటే చెప్పుకొచ్చింది. అలాగే సరదాగా నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అబ్బాయి ఉంటే చూడండి అంటూ సరదా కామెంట్స్ విసిరింది..
బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా కజిన్ గా అడుగుపెట్టిన నటి పరిణితి చోప్ర .. కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అవకాశాలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్గా నిలదొక్కుకున్నారు. ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణితి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చింది.
మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ఏం చేస్తాం నాకు మింగిల్ అవ్వాలని ఉన్న నేను సింగల్ కాబట్టి అవ్వలేకపోతున్నాను. ఇన్నాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు ఆలోచన మార్చుకున్నాను. అలియా భట్ కీయారా అద్వానీ నా స్నేహితులందరూ పెళ్లి చేసుకుంటే నాకు చేసుకోవాలని ఉంది. కానీ ఏమవుతుందో ముందు ముందు చూడాలి అంటే చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుతం తనకు ఎవరితో రిలేషన్ లేదని ఉండుంటే కచ్చితంగా పెళ్లి చేసుకునేదాన్ని అంటూ తెలిపింది.