Entertainment పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బ్రేక్ అందుకున్న ఓ చిత్రం అవుతుంది ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు..
కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్కి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు… కొన్నాళ్ల క్రితం విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకున్న చిత్రాలను మళ్లీ రిలీజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు సినీ వర్గాలు.. ఈ విషయం అభిమానులకు సైతం ఎన్నో ఆనందాన్ని కలిగిస్తుంది.. తన అభిమాన హీరో చిత్రాన్ని మళ్లీ థియేటర్లో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఇప్పటివరకు అల్లు అర్జున్ పుష్ప, రజనీకాంత్ బాబా, అబ్బాస్, టాబు, వినీత్ నటించిన ప్రేమదేశం చిత్రాలు రీ రిలీజ్ చేయటానికి సిద్ధమయ్యారు.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అంటే వచ్చే ఆనందమే వేరు ఇదే క్రమంలో ఆయన నటించిన బద్రి చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది చిత్ర బృందం..
పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బద్రి సినిమా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది తమ్ముడు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చింది ఇందులో ఆయన సరసన అమీషా పటేల్ రేణు దేశాయ్ నటించారు ఈ చిత్రంతోనే రేణు దేశాయ్ పవన్ కళ్యణ్ మధ్య బంధం బలపడింది 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా రిలీస్ కాన ఉందని వార్తలు వినిపించడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడుతున్నారు..