యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
సుహాస్ తన అమ్మ నాన్నల ఫోటోని గుర్తుపట్టని హాస్పిటల్ సీన్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసింది. టీజర్ లో చూపించిన పాత్రల మొహాలపై బ్లర్ ఎఫెక్ట్ తో ప్రజెంట్ చేసి, తర్వాత ఈ కథ వెనుక వున్న అసలు కాన్సెప్ట్ ని రివిల్ చేశారు. ‘ఫేస్ బ్లైండ్ నెస్’ నేపధ్యంలో ఈ కథ ఉండబోతుంది. దర్శకుడు కాన్సెప్ట్, క్రైమ్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ ప్లే లో బ్లెండ్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా వుంది. సుహాస్ గతంలో ఎన్నడూ చేయని ఇంటెన్స్ పాత్రలో కనిపించారు. తన సహజమైన నటనతో మెస్మరైజ్ చేశారు. వైవా హర్ష, నందు, నితిన్, హర్ష వర్ధన్ పాత్రలు కూడా కీలకంగా కనిపించాయి. టీజర్ కి విజయ్ బుల్గానిన్ అందించిన నేపధ్య సంగీతం సస్పెన్స్ ని మరింత ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ యూనిక్ కాన్సెప్ట్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాలా క్యురియాసిటీ పెంచింది.
హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ప్రసన్న వదనం’ సినిమా చాలా బావుటుంది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. దర్శకుడు అర్జున్ కి ధన్యవాదాలు. తను సుకుమార్ గారి అసోసియేట్. అర్జున్ నరేషన్ సుకుమార్ గారిలానే వుంది. ఫేస్ బ్లైండ్ నెస్ మీద చేస్తున్న చాలా మంచి థ్రిల్లర్ ఇది. సినిమా చాలా బావొచ్చింది. అవుట్ పుట్ అదిరిపోయింది. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలు మణికంఠ, ప్రసాద్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పాషన్ తో నిర్మించారు. సినిమాకి కావాల్సినది సమకూర్చారు. పాయల్, రాశి మంచి నటన కనబరిచారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది పక్కాగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా. అందులో డౌట్ లేదు’ అన్నారు.