Health : గర్భధారణ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారు అందుకే తెలిసి తెలియక ఎలాంటి తప్పులు చేయకూడదు ముఖ్యంగా తల్లి చేసే పనులు అన్ని బిడ్డ పైన ప్రభావం చూపిస్తాయని గుర్తుంచుకోవాలి. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలుస్తోంది.
కొన్నిసార్లు చాలా చిరాకుగా అనిపించి గర్భధారణలో వాంతులు వికారం కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి సాధారణ లక్షణాలు అని ప్రతిసారి అజాగ్రత్త చేయకుండా వైద్యుల్ని అవసరమైనప్పుడు తప్పకుండా సంప్రదించాలి..
ఈ సమయంలో ఎక్కువగా జ్వరం వస్తున్న తిన్నది అరగకుండా ఇబ్బంది పెడుతున్న వైద్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి.. అలాగే తల్లి మనసును వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీని వలన పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అలాగే వారి జ్ఞాపకశక్తి సైతం మెరుగుపడుతుందని తెలుస్తోంది. ఎలాంటి పండుగ వేళలు అయినా ఉపవాసం చేయకూడదు. అలా అని మితిమీరి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎలాంటి భయాందోళన, ఒత్తిడి ఉంచుకోకూడదు.
పగటి పూట నిద్ర చేయకూడదు. ఎగుడు దిగుడు ఉన్నచోట కూర్చోకూడదు. భయం కలిగించి, మనసుని చిరాకు తెప్పించే పనులు చేయకూడదు. అలాంటి మనుషులతో ఉండకూడదు. పొగ తాగే అలవాటు ఉన్నా.. మద్యం సేవించే అలవాటు ఉన్న వాటిని గర్భధారణ సమయంలో చేయకపోవడం మంచిది. అధికంగా మాంసాహార పదార్థాలు, మసాలా పదార్థాలు తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో ఇంగువ, వెల్లులి , నువ్వులు బొప్పాయి, అధిక తీపి పదార్థాలు తినకూడదు.