PUC Chairman, TRS MLA Sri A. Jeevan Reddy Pressmeet on Dalitha Bandhu, Telangana Politcal News, Telugu World Now,
Telangana News: ఈ రాష్ట్రం లో కెసిఆర్ మీద మాట్లాడే వాళ్ళు మూడు కేటగిరి ల వాళ్ళు బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు: పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి
పీయూసీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఏ .జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ @ టీ ఆర్ ఎస్ ఎల్పి కార్యాలయం, ఈ రాష్ట్రం లో కెసిఆర్ మీద మాట్లాడే వాళ్ళు మూడు కేటగిరి ల వాళ్ళు బ్రోకర్లు ,జోకర్లు ,లోఫర్లు, …బ్రోకర్ రేవంత్ రెడ్డి ,జోకర్ బండి సంజయ్ ,లోఫర్ ఎంపీ అరవింద్ , దళిత బంధు ప్రపంచం లోనే అత్యుత్తమ పథకం , హుజురాబాద్ లో కెసిఆర్ విస్పష్టంగా దళిత బంధు గురించి చెప్పారు, 17 లక్షల కుటుంబాలకు లక్షా 70 వేల కోట్ల రూపాయల నిస్తామని కెసిఆర్ చెప్పారు, దళిత బంధు అమలైతే తమకు పుట్టగతులుండవని బ్రోకర్లు ,లోఫర్లు ,జోకర్లు కెసిఆర్ మీద మాట్లాడుతున్నారు, కెసిఆర్ అసాధ్యాన్ని సు సాధ్యం చేస్తారు ..ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు, కెసిఆర్ ఏ పథకం తెచ్చినా ప్రతిపక్షాలకు అనుమానమే ..అయినా పథకాలు విజయవంతం అవుతున్నాయి, మా అందరికీ తల్లి లాంటి శోభమ్మ ను కూడా రాజకీయాల్లోకి రేవంత్ లాగడం శోచనీయం, దమ్ముంటే కాంగ్రెస్ ,బీజేపీ నేతలు తమ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు ను అమలు చేయాలి
కెసిఆర్ ఓ విజ్ఞాని ..రేవంత్ ఓ అజ్ఞాని, శకుంతల దేవి లెక్కల్లో హ్యూమన్ కంప్యూటర్ అయితే …పాలిటిక్స్ లో కెసిఆర్ హ్యూమన్ కంప్యూటర్,
కెసిఆర్ రాజనీతిఙ్ఞత ముందు వీరెంత ? దళిత బంధు తో రేవంత్ లాంటి నేతల చిన్న మెదడు చిప్ పాడైంది, తమ దుకాణాలు బంద్ అయితాయనే అక్కసు తో రేవంత్ ,బండి సంజయ్ మాట్లాడుతున్నారు, దళిత బంధు తర్వాత కాంగ్రెస్ ,బీజేపీ కార్యాలయాలకు టు లెట్ బోర్డు తగిలించుకోవాల్సిందే, బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమం జోక్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అడ్డదిడ్డంగా మాట్లాడి అభాసు పాలైంది బండి సంజయ్, వరదల్లో దెబ్బ తిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానని మాట తిప్పి జోకర్ పేరు తెచుకున్నాడు బండి సంజయ్, మోడీ హామీల గురించి దరఖాస్తులు తీసుకో బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మతపరంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, నిజామాబాద్ అంబెడ్కర్ చౌరస్తా లో అరవింద్ బట్టలు విప్పి ఊరేగించే రోజులు దగ్గర పడ్డాయి, హుజురాబాద్ లో సీఎం కెసిఆర్ రాజకీయాలు మాట్లాడలేదు, రేవంత్ ది మయోపిక్ మైండ్, మయోపిక్ అంటే దూరదృష్టి లేని వాడని అర్థం,
రైతు బంధు కు నిధులున్నట్టే దళిత బంధు కు నిధులున్నాయి, హుజురాబాద్ లో గెలిచేది మేమె, రేవంత్ కమీషన్ ఏజెంట్ ..కాంగ్రెస్ కమీషన్ల పార్టీ, అవినీతి కి కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే బీజేపీ దర్వాజాలు తెరిచింది, ఆనాడు పీఎం గా రాజీవ్ గాంధే అన్నారు ..ప్రభుత్వ నుంచి వంద పైసలు ఇస్తే 16 పైసలు ప్రజలకు చేరడం లేదని, ఆ సంస్కృతిని దూరం చేసి నేరుగా ప్రజల అకౌంట్లలోకే డబ్బులు వేస్తున్నారు సీఎం కెసిఆర్, రేవంత్ చంద్రబాబు చప్రాసి గా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను విమర్శించి వై ఎస్ ది జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అనలేదా ?, అలాంటి రేవంత్ కు ప్రాజెక్టుల గురించి ఇపుడు మాట్లాడే హక్కు ఉందా ? డెబ్బయేండ్ల శని ఏడేండ్లలో పోతుందా ? దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, కెసిఆర్ కౌటిల్యుడి లాంటి వారు ..ఆర్థిక పరిస్థితి దృస్టిల్ ఉంచుకునే పథకాలు రచిస్తాడు, రెండేళ్లలో దళిత బంధు దేశమంతా తెచ్చేలా కేంద్రం పై ఒత్తిడి పెరగడం ఖాయం.