Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021 లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ పరిశ్రమను మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా సినీ అభిమానుల్ని కలిచి వేసింది. కాగా పునీత్ చనిపోయే సమయానికి ఆయన నటిస్తున్న కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ క్రమంలోనే పునీత్ నటించిన జేమ్స్, లక్కీమ్యాన్, గంధడ గుడి సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
ఇక తమని విడిచి పెట్టి వెళ్లిపోయిన తమ ‘అప్పు’ ని వెండితెర పై కడసారి చూసుకోడానికి థియేటర్ లకు క్యూ కట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పటికే జేమ్స్, లక్కీమ్యాన్ ఓటిటి లో కూడా రిలీజ్ కాగా.. ఇప్పుడు అప్పు చివరి మూవీ గంధడ గుడి కూడా ఓటిటి రిలీజ్ కి సిద్దమవుతుంది. గత ఏడాది పునీత్ వర్ధంతి సందర్భంగా ఈ చిత్రం థియేటర్ లోకి వచ్చింది. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిన ఈ మూవీ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీగా తెరకెక్కింది. పునీత్ స్నేహితుడు అమోఘ వర్ష ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. పునీత్ సతీమణి అశ్విన్ పునీత్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కాగా మార్చి 17 పునీత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఓటిటి లోకి తీసుకు వస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గంధడ గుడి స్ట్రీమ్ కానుంది.
Iconic Kannada Actor @PuneethRajkumar’s Swan Song, Gandhadagudi – Journey of a True Hero, is all set for a streaming premiere on @PrimeVideoIN on his birth anniversary, March 17#GandhadaGudiOnPrime @Ashwini_PRK @PRK_Productions pic.twitter.com/3kVmMjlN3L
— Ramesh Bala (@rameshlaus) March 14, 2023
ఇక కన్నడలో ఆయన చేసిన ఎన్నో మంచి పనుల గురించి లోకానికి తెలిసిందీ లేదు. పునీత్ మరణవార్త వినగానే దాదాపు 10 లక్షల మంది ఆయనను చూసేందుకు వచ్చారంటే అప్పుడు అర్థమైంది పునీత్ ఎంత గొప్పవాడో. ఆయన ఫ్యామిలీ మొత్తం ప్రజలకు ఎంతో చేసింది. అందులో పునీత్ చేసిందే లెక్కకుమించి ఉంది. 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించారు. గో షాలలు, వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాలు..ఇలా ఒకటేమిటి అడిగినవారికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప వ్యక్తి.