R Narayana Murthy Raithanna Movie Watched Telangana Minister Jagadish Reddy, Latest Telugu Movies, Telangana News, Telugu World Now,
“రైతన్న” సినిమాను వీక్షించిన “మంత్రి జగదీష్ రెడ్డి” – కృతజ్ఞతలు తెలిపిన “ఆర్.నారాయణ మూర్తి”
ఆర్ .నారాయణ మూర్తి కామెంట్స్ : మంత్రి జగదీష్ రెడ్డి మా శ్రేయోభిలాషులు, రైతన్న సినిమాను ఆయన వీక్షించండం గొప్ప బలాన్ని ఇచ్చింది, కేంద్రప్రభుత్వం చట్టాలు రైతులకు శాపలుగా పరిణమించ బోతున్నాయి, ఢిల్లీలో 8 నెలలుగా జరుగుతున్న రైతన్నల మహోన్నత పోరాట సారాంశం ఇదే, ఇప్పటికే ఈ చట్టం బీహార్ లో అమలు పరిచారు, అక్కడ రైతులు కూలీలుగా మారారు, ఇప్పుడు దేశం మొత్తం విస్తరించాలి అన్నది కేంద్రం కుట్ర, అదే జరిగితే యావత్ భారతదేశంలో రైతులు ఉండరు…కూలీలుగా మారతారు, విద్యుత్ సవరణ చట్టం కార్పొరేట్ వ్యవస్థకు లబ్ది చేకూర్చేందుకే, సవరణ అంటూ జరిగితే ఉచిత విద్యుత్ కు మంగళం పాడినట్లే, అదే ఇతి వృత్తాంతంతో రైతన్న సినిమా ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు.
కేంద్రప్రభుత్వం తీసుకవస్తున్న రైతు చట్టాలు రైతుల మీద ఉరుములు లేని పిడుగుల లాంటివాని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చే కుట్రలో భాగమే ఆ చట్టాల రహస్యం మని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి ఇతి వృత్తాన్ని ఆధారం చేసుకుని ప్రముఖ సినీ నిర్మాత,దర్శకుడు నటుడు కుడా ఆయిన ఆర్ నారాయణ మూర్తి రైతన్న సినిమాను రూపొందించారని ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకరానున్న రైతు చట్టాలతో పాటు విద్యుత్ చట్టంలో సవరణలను ఉటంకిస్తూ కళ్ళకు కట్టినట్లు గా రైతన్న సినిమా ఉందని ఆయన కొనియాడారు. రైతాంగాన్ని ఉద్దేశించి ఆర్.నారాయణ మూర్తి తీసిన సినిమాను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం రోజున సూర్యపేట జిల్లా కేంద్రంలో రైతులతో కలసి వీక్షించిన విషయం విదితమే. తాను రూపొందించిన సినిమాను థియేటర్ కు వెళ్లి మరీ సినిమా చూశారు అన్న విషయం తెలుసుకున్న సినిమా నిర్మాత, దర్శకుడు, నటుడు కుడా ఆయిన ఆర్.నారాయణ మూర్తి గురువారం రోజున సూర్యపేట కు చేరుకుని మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆర్.నారాయణ మూర్తి తో కలసి మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులపై అవగాహన కల్పిస్తునే సమాజంలో చైతన్యం కలిగించేందుకు ఆర్.నారాయణ మూర్తి రూపొందించిన రైతన్న సినిమా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గాడిలో పడుతుంది అనుకున్న వ్యవసాయం కేంద్రం తెచ్చే చట్టాలతో కునారిల్లా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి కావాల్సిన నీరు,పెట్టుబడి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండగా మార్కెటింగ్ అన్నది కేంద్రం చేతిలో ఉంటుంది అన్నారు.అటువంటి కేంద్రం ఇప్పుడు చట్టాల పేరిట రైతులను కూలీలుగా మార్చే ఇతి వృత్తమే రైతన్న సినిమా అని ఆయన చెప్పారు. అటువంటి సినిమా తీసి రైతాంగంలో చైతన్యం నింపుతున్న ఆర్.నారాయణ మూర్తిని ఆయన అభినందించారు.
అనంతరం రైతన్న సినీ నిర్మాత,దర్శకుడు,నటుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తీసుకు రానున్న చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారబోతున్నాయన్నారు. ఇప్పటికే బీహార్ లో ఈ చట్టాలు అమలులో ఉన్నాయని దాంతో అక్కడ రైతులు కాస్తా కూలీలుగా మారారన్నారు.ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలి అన్నది కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు. అదే జరిగితే యావత్ భారతదేశంలో రైతులే ఉండరని మొత్తం కూలీలుగా మారుతారని ఆయన హెచ్చరించారు. విద్యుత్ సవరణ చట్టం కూడా కార్పొరేట్ వ్యవస్థకు లబ్ది చేకూర్చేందుకే అని ఆయన తెలిపారు. సవరణ అంటూ జరిగితే ఉచిత విద్యుత్ కు మంగళం పాడినట్లే నని ఆయన చెప్పారు. అదే ఇతి వృత్తాంతం తో రైతన్న సినిమాను రూపొందించమని ఆయన చెప్పారు. అటువంటి సినిమాను వీక్షించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమయం కేటాయించి థియేటర్ కు వెళ్లి మరీ సినిమాను చూడడం మాకు గొప్ప బలాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. అందుకు మంత్రి జగదీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన మాకు, రైతులకు శ్రేయోభిలాషులని ఆయన కొనియాడారు.