Rajini Kanth : దేశ వ్యాప్తంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ అందరికీ తెలిసిందే. తలైవా అంటే చాలు అదో రాకమిన విబ్రతిఒన్స్ రావల్సిందే. దేశ విదేశాల్లో సైతం ఆయనకు వున్న అభిమానులు లెక్కకు మించే అని చెప్పాలి. అంతా అభిమానబలాన్ని సంపాదించుకున్నారు రజినీ. ఆయన స్టయిల్ ఇతే ఇంకా వేరే లెవెల్, ఆ డైలాగ్ డెలివరీ సినిమాలకు ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటినటుల్లో నిలిచి విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ అంటే రజినీ అనే చెప్పాలి.
అయితే రజినీ కాంత్ గతంలో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. ఆయన నిర్ణయం పట్ల అభిమానులు ఒకింత నిరాశ చెందిన మాట వాస్తవమే. ఆ నిర్ణయం నుంచి తాను యూటర్న్ ఎందుకు తీసుకున్నానన్న విషయాన్ని రజనీకాంత్ తాజాగా వెల్లడించారు.
అలానే తాను కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. తాను ఈ విషయాలు చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పిన రజనీకాంత్.. లేడు అనే వారు కనీసం ఒక్క రక్తపు బొట్టునైనా తయారు చేసి చూపించాలని సవాలు చేశారు. అదే విధంగా ఈ ఈవెంట్‌లో వెంకయ్య నాయుడుని గురించి చెబుతూ.. ‘గొప్ప నాయకుడైన వెంకయ్య నాయుడు గారిని రాజకీయాల నుంచి దూరం చేశారు. ఆయనకు ఉపరాష్ట్రపతి ఇవ్వటం నాకు నచ్చలేదు’ అన్నారు.