మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నారు. ప్రతీ ఒక్క ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ కారెక్టర్స్ పోషిస్తున్నారు. తాజాగా రవితేజ మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేశారు. తాజాగా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైగర్ నాగేశ్వర రావు పేరుతో రాబోతోన్న ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. స్టువర్ట్ పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ రోల్‌ను పోషించేందుకు రవితేజ పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో రవితేజ ఆకట్టుకోబోతోన్నారు.
గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వంశీ ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. తేజ్ అగర్వాల్ నారాయణ్ సమర్ఫణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ కథ మీదున్న నమ్మకంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్‌లో నిర్మించేందుకు నిర్మాతలు సిద్దమయ్యారు. రవితేజకు ఇదే మొదటి పాన్ ఇండియన్ సినిమా. తెలుగు,తమిళ, కన్నడ మళయాల హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
నటీనటులు: రవితేజ
సాంకేతిక నిపుణులు:
రచయిత, దర్శకుడు : వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్ఫణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
మాటలు: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
డీఓపీ: ఆర్ మధి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
పీఆర్వో: వంశీ-శేఖర్