Regina Cassandra Starrer “NeneNaa” Wraps Up Shoot. Post-Production Work in Final Stages, Director Caarthick Raju, Vennela Kishore, Thagubothu Ramesh, Latest Telugu Movies, Telugu World Now,
Tollywood Upadates: షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ తుది దశకు చేరుకున్న “రెజీనా కసాండ్ర” తాజా చిత్రం “నేనే నా”
హీరోయిన్ రెజీనా కసాండ్ర లేటెస్ట్ మూవీ ‘నేనే నా’. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ సినీ ఇండస్ట్రీ సహా ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించింది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్న రెజీనా తాజా చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా…
డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘నేనే నా’ సినిమా షూటింగ్ సజావుగా సాగిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాం. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్ విజువల్స్, మిస్టరీ కథాంశంతో రన్ అయ్యే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్ శేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. కుట్రాలం పరిసర ప్రాంతాల్లో సినిమా మేజర్ పార్ట్‌ను చిత్రీకరించాం. ప్రతి చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న రెజీనా కసాండ్ర ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా పాత్రలో కనిపించబోతున్నారు. శామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్. సాబు ఎడిటర్. సూపర్ సుబ్బరాయన్ స్టంట్ మాస్టర్.
రెజీనా కసాండ్ర ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అక్షర గౌడ, తాగుబోతు రమేశ్, జయప్రకాశ్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు.
నటీనటులు:
రెజీనా కసాండ్ర, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేశ్, జయప్రకాశ్, అక్షర గౌడ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ
బ్యానర్: యాపిల్ ట్రీ స్టూడియోస్
మ్యూజిక్: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
ఎడిటర్: సాబు
స్టంట్స్: సూపర్ సుబ్బరాయన్
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్