Six Male And Six Female Lead Actors In Nani Presents, Wall Poster Cinema’s “Meet Cute” Movie, Latest Telugu Movies, Telugu World Now
FILM NEWS: ఆరుగురు మేల్ లీడ్స్, ఆరుగురు ఫిమేల్ లీడ్స్‌తో నాని సమర్పకుడిగా వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న “మీట్ క్యూట్”
నేచురల్ స్టార్ నాని.. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి సమర్పకుడిగా వ్యవహరిస్తూ.. ప్రశాంతి తిపిర్‌నేని నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. `ఆ, హిట్` వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించి ఆడియెన్స్‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అదే తరహాలో డిఫరెంట్ కంటెంట్‌తో `మీట్ క్యూట్` అనే అంథాలజీని రూపొందిస్తోంది వాల్ పోస్టర్ సినిమా. `ఆ` సినిమాతో ప్రశాంత్ వర్మ, `హిట్` చిత్రంతో శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేసిన ఈ బ్యానర్ ఇప్పుడు `మీట్ క్యూట్` ద్వారా దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు.
అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తూ `మీట్ క్యూట్` ప్రాజెక్ట్‌ను జూన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఐదు కథల సంకలనంగా రూపొందుతోన్న ఈ అంథాలజీని సీనియర్ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ అంథాలజీలో రోహిణి, ఆదాశర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునైన, సంచితా పూనాంచ .., అశ్విన్‌కుమార్, శివ కందుకూరి దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా … ఇలా ఇందులో వేర్వేరు భాషలకు చెందిన ఆరుగురు మేల్ లీడ్స్, ఆరుగురు ఫిమేల్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. .
వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీత సారథ్యం వహిస్తుండగా… అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్, గ్యారీ బి.హెచ్ ఎడిటర్స్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
సత్యరాజ్, రోహిణి, ఆదాశర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునైన, సంచితా పునాంచ, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మ సూర్య, రాజా తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: నాని
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
రచన, దర్శకత్వం: దీప్తి గంటా
నిర్మాత: ప్రశాంతి త్రిపిర్‌నేని
సినిమాటోగ్రఫీ: వసంత్ కుమార్
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాశ్
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
లిరిక్స్: కెకె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్