Star Mahila Kabaddi Halchal Logo Launched, Minister V Srinivas Goud, VBR Developers, GHMC Women Corporators, TV Female Artists, Telangana Association of Real Stage Artists,
SPORTS NEWS: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ గారు VBR డవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “స్టార్ మహిళ కబడ్డీ హల్ చల్” లోగో ను హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. మన దేశంలో ఎంతో ప్రాచీన క్రీడా కబడ్డీ ని ప్రోత్సాహించాలనే సంకల్పంతో GHMC మహిళ కార్పొరేటర్లు , ప్రముఖ TV మహిళ ఆర్టిస్టులు, జానపద మహిళ కళాకారిణి లు, సామాజిక మాధ్యమాల్లో ని ప్రముఖ మహిళ ల చే నిర్వహిస్తున్న ‘స్టార్ మహిళ కబడ్డీ హల్ చల్’ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కబడ్డీ తో పాటు ఇతర ఇండోర్ గేమ్స్ ను ఆడుతూ తమ ఫిట్ నెస్ ను పెంపొందించుకునే వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు క్రీడల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా మహిళ లను అన్ని రంగాల్లో, క్రీడా విభాగాల్లో ప్రోత్సాహిస్తున్నారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మంత్రి కబడ్డీ హల్ చల్ నిర్వహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ రియల్ స్టేజి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమాదిత్య రెడ్డి, ఉపాధ్యక్షురాలు యాట నవీన, గౌరవ సలహాదారు విజయ లక్ష్మి, కోశాధికారి, ప్రముఖ నటి శ్రీ వాణి, VBR డవలపర్స్ MD రవి, తదితరులు పాల్గొన్నారు.