సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా హై యాక్షన్ ఓల్టేజ్‌తో రాబోతోన్న పెద్దన్న చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.
ఈ ట్రైలర్లో రజినీ మార్క్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. ఊరి పంచాయితీ పెద్దగా రజినీకాంత్ కనిపించబోతోన్నారు. అతని ముద్దుల చెల్లెలిగా కీర్తి సురేష్ నటించారు. ఇక రజినీ కాంత్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రెండు నిమిషాల నలభై సెక్లను ఉన్న ఈ ట్రైలర్లో రజినీ మేనియా మొత్తం కనిపించింది.
నయనతార అందంగా ఉంది. ఇక క్రూరమైన విలన్‌గా జగపతి బాబు మెప్పించారు. ఇక ఈ చిత్రంలో మీనా, కుష్బూ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు.