Sushanth : అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో “సుశాంత్ అనుమోలు” కూడా ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా 2008 లో వచ్చిన కాళిదాసు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. ఆ తర్వాత కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా.. పలు సినిమాలు చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. కాగా అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం” సినిమాతో కొంచెం ట్రాక్ మార్చాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం హీరో గానే కాకుండా.. ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సుశాంత్ మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
కాగా సుశాంత్ తాజాగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ త్వరలోనే “భోళా శంకర్” గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్ గా వస్తుంది. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది.
కాగా మూవీ యూనిట్ తాజాగా ట్విట్టర్ వేదికగా సుశాంత్ ఫోటోని షేర్ చేసి.. భోళా శంకర్ ఫ్యామిలీ లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రాసుకొచ్చింది. ఇందుకు సుశాంత్ బదులిస్తూ మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం చాలా హ్యాప్పీ గా ఉంది అని రిప్లయ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.